బిజినెస్

ఇక ‘క్లిక్’ చేస్తే ఇసుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 1: ఇసుక కావలసిన వారు ఇక కంప్యూటర్, స్మార్ట్ఫోన్లలో క్లిక్ చేస్తే సరిపోతుంది. రాష్ట్రంలో 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఇసుక విధానంలో అధునాతన సాంకేతిక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. మాఫియా సంస్కృతి వేళ్లూనుకుని, అత్యంత వివాదాస్పదంగా, అక్రమార్జనకు సులభ మార్గంగా మారిన ఇసుక విధానాన్ని చక్కదిద్ది, సామాన్యులకు చౌకగా అందించడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్న సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) శాండ్ పోర్టల్ ద్వారా ఇసుక ఆధునిక విధానంలో విక్రయాలు జరగనున్నాయి. డీజిల్ ధర, ఇతర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కిలోమీటర్‌కు ఇంతని ఏపీ ఎండీసీ రవాణా ఛార్జీలు నిర్ణయిస్తుంది. ఈ ధరతో ఇసుక రవాణా చేసే వాహనాల వారందరికీ ఏపీఎండీసీ ఇసుక సరఫరా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పిస్తుంది. ఇసుక కావలసిన వారు క్లిక్ చేయగానే పోర్టల్‌లో ధర ప్రత్యక్షమవుతుంది. ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఇతర విధానాల ద్వారా నేరుగా రాష్ట్ర ఖజానాకు చెల్లించగానే ఇసుక బుకింగ్ అయినట్టు రసీదు వస్తుంది. మరో క్లిక్ చేస్తే ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్లు వున్నాయి, ఆయా స్టాక్ పాయింట్లలో ఎంతెంత ఇసుక నిల్వవుందనే విషయాలు కూడా వెల్లడవుతాయ. ఏపీ ఎండిసీ శాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అని క్లిక్ చేస్తే ఎక్కడెక్కడ వాహనాలు అందుబాటులో ఉన్నాయో తెలుస్తుంది. ఆయా వాహనాలను బుక్ చేసుకుంటే కోరిన చోటకు ఇసుక చేరుతుంది.
ఇసుక సరఫరాను పర్యవేక్షించడానికి వాహనాలకు అత్యాధునిక జీపీఎస్ పరికరాలను ఏర్పాటుచేసుకోవాలని ప్రభుత్వం నిర్ధేశిస్తోంది. గతంలో సైతం ఈ నిబంధన ఉన్నప్పటికీ, అది సక్రమంగా అమలుకాలేదు. జీపీఎస్ పరికరాల కోసం ఐదు కంపెనీలను ప్రభుత్వం గుర్తించింది. గతంలో ప్రభుత్వం రూ.80 లక్షలు ఖర్చు చేసి ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఆ సాఫ్ట్‌వేర్‌ను పక్కనపెట్టి, బెంగళూరుకు చెందిన మరో కంపెనీ సాఫ్ట్‌వేర్ తాజాగా ముందుకొస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రూ.3,500 ఖరీదుకు జీపీఎస్ పరికరం లభిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సుమారు రూ.8000 విలువైన ఎస్-145 డిజిటల్ టెక్నాలజీ జీపీఎస్ పరికరాన్ని అమర్చుకోవాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇప్పటికే అమర్చుకున్న పాత జీపీఎస్ పరికరాలు పనికిరావని అంటున్నారు. దీనికి తోడు రీచ్‌కు 30 కిలోమీటర్ల పరిధిలో ఇసుక సరఫరాకు కేవలం ట్రాక్టర్లు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని సమాచారం. అయితే ట్రాక్టర్ యజమానులకు జీపీఎస్ పరికరాల ఏర్పాటు భారంగా భావిస్తున్నారు. జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలు ఎక్కడ ఎప్పుడు ఇసుక లోడు చేసుకుని, ఎప్పుడు ఎక్కడ దించాయనే విషయాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. కాగా కొత్త విధానంలో ఆరు యూనిట్లు (20 టన్నులు) ఇసుకను విశాఖ చేర్చడానికి సుమారు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు అవుతుందని తెలుస్తోంది. ఒక్కో టన్ను రూ.8000 కావ్వొచ్చని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌కు తరలించడానికి అవుతున్న ధర ఈ కొత్త విధానంలో విశాఖపట్నానికే అవుతుందని అంచనా. ఒక టన్ను ఇసుక ఒక కిలోమీటర్ దూరానికి రూ.100 రవాణా ఛార్జీగా ఏపీ ఎండిసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈవిధంగా చూస్తే రాజమహేంద్రవరం నుంచి విశాఖకు సుమారు 200 కిలోమీటర్లు, దీనిని బట్టి కేవలం రవాణా ఛార్జీయే రూ.20వేలు కావొచ్చు. ఇసుక తవ్వకం నుంచి స్టాక్ పాయింట్‌కు చేర్చడం వరకు ప్రభుత్వానికే సుమారు రూ.30వేలు ఖర్చవ్వొచ్చు. ట్రాన్స్‌పోర్టుతో కలుపుకుంటే విశాఖ తరలించాలంటే 20 టన్నులు దాదాపు రూ.50వేలు ఖర్చవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక వేళ విశాఖ వంటి ప్రాంతాల్లో స్టాక్ యార్డు పెట్టి అక్కడ నుంచి స్థానికంగా తరలించినప్పటికీ ఈ విధంగానే ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు అవుతాయని తెలుస్తోంది. మొత్తం మీద బాలారిష్టాలను దాటి కొత్త విధానం పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టే అవకాశముంది.