బిజినెస్

రూ. 2.55 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి నేపథ్యంలో మంగళవారం నాడు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. సూచీలు దాదాపు రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేయడంతో మదుపర్ల సంపద రూ. 2.55 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్‌ఈలో దాదాపు 200 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరాయి. ఎటూ తేల్చుకోలేని పెట్టుబడిదారులు వేచిచూసే దోరణిని అవలంబించడంతోబాటు పెద్దయెత్తున వాటాల విక్రయాలకు పాల్పడ్డారు. ఈక్రమంలో బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఏకంగా 769.88 పాయింట్లు కోల్పోయింది. 2.06 శాతం నష్టాలతో 36,562.91 పాయింట్ల కనిష్టానికి చేరింది. బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,55,585.56 కోట్ల నుంచి రూ. 1,38,42,866.10 కోట్లకు పడిపోయింది. ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాహన విక్రయాల గణాంకాలు స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు అంచనాలకంటే కనిష్ట స్థాయికి చేరడం దేశ ఆర్థిక మాంద్య తీవ్రతకు అద్దంపట్టడంతో బాటు మరికొన్ని ఆర్థిక, వ్యవస్థాపక విధానాలను ప్రభుత్వం చేపట్టాల్సిన తప్పనిసరి పరిస్థితిని సూచించింది. ఈ పరిణామం మదుపర్లకు తీవ్ర ఆందోళనకరంగా మారిందని విశే్లషకులు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన కొన్ని ఉద్దీపన చర్యలు సమస్యను తగ్గించేందుకు దోహదపడతాయి తప్ప పూర్తిగా పరిష్కరించలేవని, ఈక్రమంలో పూర్తి ట్రెండ్‌ను మార్చేలా చర్యలు చేపట్టాలన్న డిమాండ్ ఓవైపు పెరిగింది. అలాగే అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలపై ఓ వైపుచర్చలు మళ్లీ ప్రారంభించినప్పటికీ మరోవైపుఇరు అగ్ర దేశాలూ దిగుమతులపై పరస్పరం సుకాలను పెంచడంతో ఉద్రిక్తతలు మరింతగా ఆజ్యం పోసుకున్నాయని యాక్సిస్ సెక్యూరిటీస్ సీఈవో, ఎండీ అరుణ్ తుక్రాల్ పేర్కొన్నారు. ఇలావుండగా బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్‌లో 28 వాటాలు మంగళవారం తీవ్ర నష్టాలను సంతరించుకున్నాయి. ఇందులో ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటామోటార్స్ అత్యధికంగా 4.45 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈలో మొత్తం 1,613 వాటాలు నష్టపోగా, 817 వాటాలు లాభపడ్డాయి. సుమారు 200 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని నమోదు చేశాయి. మరో 178 వాటాలు ఎలాంటి ఎదుగుబొదుగూ లేకుండా ఉన్నాయి. తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు బలహీనంగా ఉండటంతోబాటు కీలక రంగాల్లో వృద్ధి సైతం మందగించడం మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసిందని, అలాగే అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ఆజ్యం పోసిందని ప్రముఖ విశే్లషకుడు జోసెఫ్ థామస్ అభిప్రాయపడ్డారు. ఇలావుండగా బ్రాడర్ మార్కెట్‌లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.65 శాతం నష్టపోయాయి.
రూపాయి మరింత బలహీనం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి మారకం విలువ మరింతగా బలహీన పడింది. 90 పైసల విలువ కోల్పోయి ఇంట్రాడేలో 72.27 రూపాయలుగా ట్రేడైంది. కాగా దేశ ఆర్థిక స్థితి, కునారిల్లుతున్న వాహన రంగ విక్రయాలు, తయారీ రంగం వంటివి పరిశీలిస్తే మార్కెట్లకు నష్టాల పరంపర కొనసాగే అవకాశాలున్నాయని మరో విశే్లషకుడు అజిత్‌మిశ్రా అభిప్రాయపడ్డారు.