బిజినెస్

విజయవాడ - గూడూరు ఇంటర్‌సిటీకి విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: ఇటీవల భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించిన విజయవాడ - గూడూరు ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కి వినియోగదారుల నుండి భారీ స్పందన లభించి 85 శాతం ప్రయాణికులతో నడుస్తోంది. సౌకర్యవంతమైన సమయాల్లో రాష్ట్ర రాజధాని, సింహపురి ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, కావలి, నెల్లూరు ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటోంది. జర్మనీ సాంకేతిక విజ్ఞానంతో తయారైన లింక్ హోఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను ఈ ఎక్స్‌ప్రెస్‌కు ఉపయోగిస్తున్నారు. ఈ కోచ్‌లకు ఎక్కువ భారాన్ని మోపే సామర్థ్యంతో పాటు, గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. 14 కోచ్‌లున్న ఈ రైలులో 2 ఏసీ చైర్‌కార్లు, 4 సెకండ్ క్లాస్ రిజర్వుడ్ సిట్టింగ్ కోచ్‌లు, 8 సాధారణ ప్రయాణికుల కోచ్‌లతో మొత్తం 1,116 సీట్లు కలిగి ఉంటుంది. ఏసీ చైర్‌కారులో 156 సీట్లు, సెకండ్ సిట్టింగ్ చైర్‌కారులో 432 సీట్లు, సాధారణ సెకండ్ క్లాస్ సిట్టింగ్‌లో 528 సీట్లు ఉంటాయి. గూడూరు - విజయవాడ మధ్య ఈ రైలు ప్రయాణించే కాలం 4.30 గంటలు, టికెట్ల ధర కూడా బస్సు చార్జీలతో పోలిస్తే తక్కువే. ఈ రైలు విజయవాడ డివిజన్‌లో హెడ్ ఆన్ జనరేషన్ పవర్‌తో నడిచే మొదటి రైలుగా గుర్తింపు పొందింది.