బిజినెస్

సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 5: సాగర్‌లోని ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం సాయంత్రం నుండి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. గత వారం రోజులుగా ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తలెత్తిన సాంకేతిక కారణాలకు తోడు కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపులు జరగని కారణంగా జెన్‌కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. జెన్‌కో ఎస్‌ఈ రాజనర్సయ్య మాట్లాడుతూ 15 టీఎంసీల మేరకు సాగర్ జలాశయం నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ దిగువకు నీటి విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం నుంచి ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 585.30 అడుగులు ఉండగా కుడి కాల్వ ద్వారా 7,978 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 4,881 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,091 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తంగా 40,660 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
కాగా ఎగువ శ్రీశైలం నుండి కూడా విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ జలాశయానికి 31,784 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటుంది. శ్రీశైలానికి ఎగువ నుండి 1,23,206 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రస్తుతం శ్రీశైలంలో 877.70 అడుగులుగా ఉంది. శ్రీశైలం ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది.
చిత్రం...585.30 అడుగులుగా సాగర్