బిజినెస్

మద్యం దుకాణాల నిర్వహణకు రూ. 93 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు వీలుగా 93 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం మంజూరు చేసింది. రాష్ట్రంలో 3500 మద్యం దుకాణాలను రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించడం తెలిసిందే. దీంతో దుకాణాల అద్దె, వేతనాలు, రవాణా, విద్యుత్ చార్జీలు తదితర ఖర్చులు చెల్లించేందుకు వీలుగా ఈ నిధులు కేటాయిస్తూ పాలనామోదాన్ని ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యాహ్న భోజనం
వంట రేట్లు పెంపు
రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వంట రేట్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వంట చేసేందుకు చెల్లించే రేట్లను 3.09 శాతం మేర పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో రూ. 4.35 నుంచి రూ.4.48కు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.6.51 నుంచి 6.71 రూపాయలకు, 9, 10 తరగతులకు కూడా 6.71 రూపాయలకు పెంచింది. అయితే 9, 10 తరగతులకు ఈ మొత్తాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.
సెజ్‌ల డీ-నోటిఫికేషన్‌కు
మార్గదర్శకాలు జారీ
వివిధ రాయితీలతో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లు ఇటీవల కాలంలో ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదు. వివిధ పన్నుల విధింపు, వ్యాణిజ్యానికి సంబంధించి లబ్ధి వర్తింప చేయకపోవడం వంటి కారణాలతో సెజ్‌ల ఏర్పాటు లక్ష్యాలను చేరుకోవడం లేదు. ఇండస్ట్రియల్ పార్కుల్లోని డొమెస్టిక్ టారిఫ్ ఏరియా (డీటీఏ) ద్వారా దేశీయంగా తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సెజ్‌ల డీ-నోటిఫికేషన్‌కు, సెజ్‌లను డీటీఏలుగా మార్చేందుకు వీలుగా మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జారీ చేసింది.