బిజినెస్

నష్టాల్లో మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : వాహన రంగ షేర్లు రాణించినప్పటికీ బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు చతికిలపడటంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం 80 పాయింట్ల దిగువన ముగిసింది. సెనె్సక్స్ ఉదయం సెషన్‌లో 174 పాయింట్లు పుంజుకున్నప్పటికీ, తరువాత దానిని నిలబెట్టుకోవడంలో విఫలమయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 80.32 పాయింట్ల (0.22 శాతం) దిగువన 36,644.42 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఇంట్రాడేలో ఈ సూచీ 36,898.99 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 36,541.88 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య కదలాడింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ గురువారం స్వల్పంగా 3.25 పాయింట్లు (0.03 శాతం) పుంజుకొని 10,847.90 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెనె్సక్స్ ప్యాక్‌లో ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజి, కోటక్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, టెక్ మహీంద్ర, హెచ్‌యూఎల్ నష్టపోయాయి. వీటి షేర్ల విలువ 2.67 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, యెస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, మారుతి, ఎంఅండ్‌ఎం, వేదాంత, టాటా స్టీల్, బజాజ్ ఆటో షేర్ల ధరలు 7.81 శాతం వరకు పెరిగాయి. వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను తగ్గించాలన్న డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసికెళ్లడంతో పాటు సంక్షోభంలో చిక్కుకున్న ఆటో ఇండస్ట్రీకి సాధ్యమయినంత మేరకు మద్దతు ఇస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇవ్వడంతో ఆ రంగం షేర్ల ధరలు పెరిగాయి. ఫలితంగా సెనె్సక్స్, నిఫ్టీ రెండింటి నష్టాలు తగ్గాయి. ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు గురువారం ఉదయం అధిక స్థాయిల వద్ద ప్రారంభమయ్యాయి. అయితే, క్రిసిల్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను తగ్గించడంతో మధ్యాహ్నం వరకు మార్కెట్ కీలక సూచీలు పడిపోవడం ప్రారంభించాయి. రంగాల వారీగా చూస్తే లోహ, వాహన, మీడియా, ఫార్మా రంగాల షేర్లు గురువారం పుంజుకున్నాయి. స్థిరాస్తి, ఆర్థిక రంగాల షేర్లు నష్టపోయాయి.