బిజినెస్

రూ.లక్ష కోట్ల మత్స్య సంపద లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 6: ప్రపంచంలో వియత్నాం వంటి చిన్న దేశాలు మత్స్య సంపద ద్వారా ఎంతో ఆదాయం సంపాదిస్తుండగా, మన దేశంలో సువిశాల తీర ప్రాంతం ఉన్నప్పటికీ మత్స్య సంపద తక్కువగా ఉందని కేంద్ర మత్స్య, పశు సంవర్థకశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం మత్స్య ఎగుమతుల ద్వారా రూ.47 వేల కోట్ల ఆదాయం లభిస్తోందన్నారు. దీనిని లక్ష కోట్లకు పెంచాలన్నదే తమ లక్ష్యమన్నారు. మత్స్య ఉత్పత్తులను పెంచాలంటే ఉత్పాదకత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలోని భోగాపురం మండలం బోయపాలెంలోని వైశాఖి బయో రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తుల పరిశ్రమలకు కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ రంగంలో ఇప్పటికే రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని వివరించారు. కాగా, మత్స్య ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో ఏపీతోపాటు హర్యానా, పంజాబ్, గుజరాత్ ముందంజలో ఉన్నాయని వివరించారు. ప్రపంచ మార్కెట్‌లో మత్స్య పరిశ్రమతోపాటు మేక, గొర్రె, పంది మాంసం ఎగుమతులకు మంచి గిరాకీ ఉందన్నారు. అనంతరం ఆయన రైతులకు రొయ్య పిల్లలను అందజేశారు. మత్స్య ఉత్పత్తుల్లో రసాయనాల వినియోగం తగ్గించాలని ఆయన రైతులకు సూచించారు. ఇక నుంచి రొయ్యల ఎగుమతుల ధ్రువీకరణ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే సర్ట్ఫికేషన్ ఇచ్చే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి హెక్టారుకు మూడు టన్నులుగా ఉందని, దీనిని తొమ్మిది టన్నులకు పెంపుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రధాని మోదీ వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. అందువల్లనే వ్యవసాయ శాఖ నుంచి మత్స్యశాఖ, పాడి పరిశ్రమ, పశుసంవర్థకశాఖలను విడదీసి దీనిని ఒక ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేశారన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బి.అప్పలనాయుడు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బాలాజీ, మత్స్యశాఖ కమిషనర్ రాం శంకర్‌నాయక్, జేసీ-2 కూర్మనాథ్, పశుసంవర్థక శాఖ జేడీ ఎంవీఏ నరసింహులు, ఇన్‌ఛార్జి ఆర్డీవో ఎస్ వేంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.