బిజినెస్

మహారాష్టల్రో కొత్త పర్యాటక పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 6: మహారాష్ట్ర ప్రభుత్వం నూతన ‘సాంస్కృతిక పర్యాటకం’ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యంగా పురావస్తు శాఖ పరిధిలోకి ఇంతవరకు రాని అనేక కోటలను అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీంతో ఆయా ప్రాంతాలు ఆర్థికంగా ఎదగడంతో పాటు రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని పర్యాటక శాఖ కార్యదర్శి వినితా సింఘాల్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. పురావస్తు శాఖ పరిధిలో అభివృద్ధి చెందిన రాయ్‌గఢ్ కోట లాంటి చారిత్రక ప్రాంతాలపై మేం దృష్టి సారించాలని అనుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు పిక్నిక్ ప్రాంతాలుగా భావిస్తూ తరచూ వచ్చే అనేక చారిత్రక ప్రాంతాలపైనే పర్యాటక శాఖ దృష్టి పెట్టిందని.. వాటిని మాత్రమే అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాలను ఆర్థికంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.