బిజినెస్

పెరుగుతున్న రుణ భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థికాభివృద్ధి రేటును 6.6 శాతానికి కుదిస్తూ మంగళవారం ‘్ఫచ్ రేటింగ్స్’ నివేదిక వెలువరించింది. గత ఏడాది ఈ వృద్ధిరేటు 6.8 శాతంగా ఉంది. గతి తప్పిన ఆర్థిక వృద్ధిరేటును గాడిన పెట్టేలా వార్షిక ఆర్థిక విధాన సరళీకరణకు ప్రభుత్వం వద్ద పరిమితమైన అవకాశాలే ఉన్నాయని, కారణం అధిక అప్పుల భారమేనని పేర్కొంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు వచ్చే ఏడాదికల్లా 7.1 శాతానికి పుంజుకునే అవకాశాలున్నాయని ఆ నివేదిక తెలిపింది. బెటర్ బిజినెస్ బ్యూరో (బీబీబీ)లో భారత రేటింగ్స్‌లో ఎలాంటి మార్పూలేదు. మధ్యకాలిక వృద్ధి అంచనాలు బలంగా ఉండటం, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు సైతం ఆశాజనకంగా ఉండటం వల్ల బీబీబీలో భారత రేటింగ్స్‌లో స్థిరత్వం కొనసాగుతోందని, ప్రత్యేకించి విదేశీ నిధుల నిల్వ, ప్రభుత్వ రుణాల కంటే అధికంగా ఉందని నివేదిక తెలిపింది. ఐతే ఆర్థిక రంగానికి కొన్ని నిర్మాణాత్మక అంశాల్లో లోపం కారణంగా ఇక్కట్లు ఎదురవుతున్నాయని తెలిపింది. పశ్చిమాసియా సార్వభౌమ నిధుల నిల్వకు సంబంధించిన అంశాలపై జరిగిన అధ్యయన నివేదికను ఈ సందర్భంగా ఫిచ్ వెల్లడించింది. భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు అంచనాలు ఇలా వరుసగా ఐదోత్రైమాసికంలో తగ్గుముఖం పట్టాయని, గడచిన ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ వృద్ధిరేటు 5 శాతానికి చేరిందని, ఇది గడచిన ఆరేళ్ల కనిష్ట స్థాయి అని నివేదించింది. అటు పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం, ప్రైవేటు మినిమయ రేటు తగ్గిపోవడం వల్లే దేశీయంగా డిమాండ్ తగ్గిపోతోందని, అంతేకాక అంతర్జాతీయంగా సైతం వాణిజ్య పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోవడం మరో ప్రతిబంధకంగా మారిందని పేర్కొంది. దేశంలో స్థూల స్థిర మూలధన నిల్వల భాగస్వామ్యం 1.3 శాతమని, గడచిన జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఇది చాలా తక్కువని తెలిపింది. అలాగే ఏప్రిల్ నుంచి జూన్ వరకు గల త్రైమాసికంలోప్రైవేటు వినిమయ శక్తి భాగస్వామ్యం సైతం 1.8 శాతానికి పడిపోయిందని, గడచిన నాలుగు త్రైమాసికాల్లో ఇది 4.6 శాతంగా ఉందని వివరించింది. ఇక తయారీ రంగం కేవలం 0.6 వృద్ధినే నమోదు చేసిందని తెలిపింది. కాగా మోటారు వాహన రంగం వంటి వాటి ఆర్థికాభివృద్ధికి చేయూత, పెట్టుబడులపై పెంచిన పన్నులు తగ్గించుకోవడం, బలహీన బ్యాంకులకు ఆర్థిక చేయూత నివ్వడం వంటి చర్యలు కేంద్రం చేపట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ వృద్ధిరేటును పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం వద్ద పరిమిత స్థా యి అవకాశాలే ఉన్నాయని, రుణ భారం మాత్రం పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఐతే ప్రభు త్వ రుణాలు క్రమంగా తగ్గుతాయని, మధ్య కాలికంగా పెట్టుబడులు కూడా పెరుగుతాయని, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల అస్థిరత ప్రభావం చూపే అవకాశం లేదని తెలిపింది.