బిజినెస్

దసరాకు 1377 ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: రానున్న దసరా, వారాంతపు సెలవుల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీ ఎన్‌వి సురేంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ ఏడో తేదీ వరకు మామూలుగా నడిపే రెగ్యులర్ బస్సులకు అదనంగా 1377 ప్రత్యేక బస్సులు నడుపనున్నామని, ఆపరేషన్స్ ఈడీ కేవీఆర్‌కే ప్రసాద్ తెలిపారు. వాస్తవానికి గత ఏడాది 1196 ప్రత్యేక బస్సులు మాత్రమే నడిపారు. ఈ నెల 27వ తేదీ శుక్రవారం 135 స్పెషల్స్ బస్సులను హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడుపనున్నారు. వీటిల్లో గుంటూరుకు 18, విజయవాడకు 30, ఒంగోలు, నెల్లూరు వైపుకు 30 బస్సులు, కర్నూలు, అనంతపూర్, కడప వైపు 20 బస్సులు నడుపనున్నారు. అలాగే 28వ తేదీన 85 ప్రత్యేక బస్సులు, 29న 22 బస్సులు, 30న 15 బస్సులు, అక్టోబర్ 1న 56 బస్సులు, 2న 25 బస్సులు, 3న 54 బస్సులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతారు. ఇక పండుగ శెలవుల రద్దీ ఎక్కువగా ఉండే అక్టోబర్ 4,5,6,7 తేదీల్లో స్పెషల్ బస్సులను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేస్తారు. 4వ తేదీన 500 బస్సులు, 5వ తేదీన 302 బస్సులు, 6వ తేదీన దుర్గాష్టమి రోజున 123 బస్సులు, 7వ తేదీన 60 బస్సులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడపనున్నారు.