బిజినెస్

అమరావతిలో ‘రియల్’ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సింగపూర్ కన్సార్టియంలు దూరం కావాలని నిర్ణయించడం, ఇతర ప్రాంతాలకు తరలించే యోచనపై జరుగుతున్న ప్రచారంతో అమరావతిలో భూముల ధరలు కుదలయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో సుప్రసిద్ధ సంస్థలు అమరావతిపై దృష్టి కేంద్రీకరించాయి. పెట్టుబడులకు గత ప్రభుత్వంతో అనేక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. అయితే రాష్ట్రంలో అధికారం మారడంతో ప్రస్తుతం రాజధాని తరలింపుపై జరుగుతున్న ప్రచారంతో విదేశీ సంస్థలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నారు.
అమరావతిపై పెట్టుబడులను ఉపసంహరించాలని వ్యాపారులు, రియల్టర్లు నిర్ణయించడంతో రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. గత రెండు నెలలుగా నిర్మాణాలు నిలిచిపోవడంతో రాజధానిలో స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వ్యాపారులు సైతం వెనక్కు తగ్గుతున్నారు. గత ఎన్నికలకు ముందు వరకు చదరపు గజం రూ.40 వేల వరకు ఉన్న భూముల ధరలు ప్రస్తుతం రూ.9 నుండి 12 వేలకు చేరాయి. దీంతో రాజధానికి భూములిచ్చిన రైతులు, ఇప్పటికే భూములు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. భూ సమీకరణలో రైతులకు వచ్చిన నివాస, వాణిజ్య ప్లాట్లకు కూడా గత కొద్దిరోజుల క్రితం వరకు భారీ గిరాకీ ఉండేది.
అయితే ప్రస్తుతం ఒక్క నేలపాడులో హైకోర్టు ఏర్పాటైన నేపథ్యంలో అక్కడ చదరపు గజం రూ.12 వేలు పై చిలుకు పలుకుతుండగా, రాజధాని ప్రతిపాదిత నెక్కల్లు మరో రెండు గ్రామాల్లో కేవలం రూ. 8 వేలలోపే అమ్మకాలు జరుగుతున్నాయి. సింగపూర్ సంస్థలు రాజధాని నిర్మాణాల కాంట్రాక్టులు రద్దు చేసే యోచనలో ఉండటంతో తరలింపుపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజధాని అమరావతికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో చేర్చకపోవడంతో కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని రైతులు సందేహిస్తున్నారు. అయితే పాలనాపరమైన రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీంతో ఏ ఏ సంస్థలు ఏ ఏ ప్రాంతాలకు తరలిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాఉంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో చర్చించేందుకు రైతులు ప్రయత్నించారు. అయితే ఇప్పటివరకు వారికి సీఎంను కలిసే అవకాశం రాలేదు. దీంతో గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని, అమరావతి రాజధాని రైతుల కమిటీ తరపున మరోసారి సీఎంను కలవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికీ సీఎం స్పందించకపోతే ఏకంగా ఢిల్లీలో తమ గోడు వినిపించాలనే యోచనలో రాజధాని రైతులున్నట్లు సమాచారం. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రాష్టప్రతి రామనాథ్ కోవింద్‌లను కలిసి వినతిపత్రాలు అందజేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ రాజధానిపై ఫోకస్ పెంచింది. రాజధాని పేరుతో టీడీపీ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్‌తో భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయనేది మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటన అనంతరం కొలిక్కి వచ్చే అవకాశముంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ప్రాంతాన్ని, సీఆర్‌డీఏకు అప్పటి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదు. ఇదే విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేస్తున్నారు. దీంతో రాజధాని తరలింపుపై గందరగోళం నెలకొంది.