బిజినెస్

వన్‌టైం సెటిల్‌మెంట్‌కు డిసెంబర్ 31 వరకూ గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: కేంద్రానికి పన్ను బకాయిపడిన వ్యాపార సంస్థలకు సదవకాశం కల్పించినట్టు సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ డీకే శ్రీనివాస్ తెలిపారు. పన్ను బకాయిదారులు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా చెల్లించాలని సూచించారు. విశాఖలోని పోర్టు ఆవరణలో ఉన్న జీఎస్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీఎస్టీ చెల్లింపులను వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసుకునేందుకు వెసులు బాటు కల్పించినట్టు వెల్లడించారు. రూ.50లక్షల లోపు పన్ను బకాయిదార్లు 50 శాతం చెల్లించాలని సూచించారు. జీఎస్టీ రాకముందు ఉన్న బకాయిలు చెల్లించేందుకు ఇది మంచి అవకాశంగా పేర్కొన్నారు. గతంలో కేంద్ర టాక్సులు చెల్లించని వారు వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా చెల్లించేందుకు ముందుకు వస్తే ఎటువంటి అపరాధ రుసుం వసూలు చేయరన్నారు. దీనికి తోడు పన్నులో రాయితీ కూడా వర్తిస్తుందన్నారు. ఏపీలోనే జీఎస్టీ బకాయలు దాదాపు రూ.3,000 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. జీఎస్టీ వినియోగదారుల సౌలభ్యం నిమిత్తం విశాఖలో ఈ నెల 13న అవగాన సదస్సు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో సీజీఎస్టీ అదనపు కమిషనర్ ఎస్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీజీఎస్టీ కమిషనర్ శ్రీనివాస్