బిజినెస్

16 ఉత్పత్తులపై టారిఫ్‌ల మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 11: అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 16 రకాల ఉత్పత్తుల టారిఫ్‌లను మినహాయిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. ఇరుదేశాల మధ్య వచ్చేనెలలో వాణిజ్య చర్చలు జరగనున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాది కాలంగా చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాలూ పట్టింపులకుపోయి వివిధ వస్తువలపై టారిఫ్‌లు పెంచేసుకుంటూ వచ్చాయి. దీని వల్ల ఇరుదేశాలూ వందలాది బిలియన్ డాలర్లు నష్టపోవల్సి వచ్చింది. బుధవారం చైనా ప్రకటించిన ఈ మినహాయింపుసెప్టెంబర్ 17 నుంచి అమలులోకి వస్తుంది. ఏడాది పాటు అమల్లో ఉంటుందని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. సీ ఫుడ్ ఉత్పత్తులతోపాటు కేన్సర్ నివారణ ఔషధాలు మినహాయించిన జాబితాలో ఉన్నాయి. అలాగే ఆల్ఫాల్ఫా పెలెట్స్, ఫిష్ ఫీడ్, మెడికల్ లీనియర్ ఉన్నా యి. బుధవారం ప్రకటించిన జాబితాలో సోయాబీన్స్, పోర్కు లేవు. కాగా అక్టోబర్‌లో మొదటి వారంలో ఇరుదేశాల మధ్య తలెత్తిన వాణిజ్య సంక్షోభంపై చర్చించనున్నట్టు వాణిజ్య సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. వాషింగ్టన్‌లో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో కొంత ఉపశమనం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక దిగ్గజ దేశాలైన అమెరికా-చైనా మధ్య తలెత్తిన వాణిజ్య యుద్ధం సమసిపోవాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఉరుదేశాలు పోటాపోటీగా పెంచేసిన టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్య రంగానే్న ఆందోళనకు గురి చేశాయి.