బిజినెస్

గిరిజన ఉత్పత్తులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: గిరిజన ఉత్పత్తులను క్రయ, విక్రయాలు చేసేందుకు దేశంలోని 191 ఆన్‌లైన్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుకాసింగ్ అన్నారు. నేషనల్ ట్రైబుల్ మిషన్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహోత్సవ్-2019 కార్యక్రమం విశాఖలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేణుకాసింగ్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గిరిజన, ఆదివాసీ సంస్కృతిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఆదివాసీ మహోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. గతంలో లడక్‌లో నిర్వహించిన ఆదివాసీ మహోత్సవానికి గిరిజన మహిళల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు, కోట్లాది రూపాయాల ఉత్పత్తుల క్రయ, విక్రయాలు జరిగాయన్నారు. ఆదివాసీలను అన్ని రంగాల్లో బలోపేతం చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో వన్‌ధన్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్ తరువాత ఏపీలోని విశాఖ జిల్లాలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమదేనన్నారు. గిరిజనులు పండించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ జిల్లాకు సంబంధించిన గిరిజన ప్రాంత సమస్యలపై కలెక్టర్ వినయ్‌చంద్‌ను అడిగి తెలుసుకున్నానని, త్వరలోనే గిరిజన మారుమూల ప్రాంతాలకు పూర్తిస్థాయిలో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం అందించే విధంగా నిధులు కేటాయిస్తామన్నారు. ముందుగా గిరిజన నృత్యమైన థింసా, కోయ నృత్యాలను పాడేరు ఎమ్మెల్యే కె.్భగ్యలక్ష్మీతో కలసి డ్యాన్స్ చేశారు. అనంతరం ఎగ్జ్భిషన్‌లో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తులను సందర్శించారు. కార్యక్రమంలో ట్రైబల్ కో- ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ రమేష్‌చంద్ర మీనా, ఈడీ సంగీత్ మహేంద్ర, పాడేరు ఎమ్మెల్యే కె.్భగ్యలక్ష్మీ, జీసీసీ ఎండీ డాక్టర్ బాబురావు నాయుడు, ఎమ్మెల్సీ పీవీ ఎన్ మాధవ్ పాల్గొన్నారు.
మార్కెట్‌లోకి జీసీసీ చాక్లెట్లు
గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన జీసీసీ చాక్లెట్లను కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుకాసింగ్ ఆవిష్కరించారు. విశాఖ జీసీసీ కార్యాలయం వద్ద ఆరబికా పేరిట ఏర్పాటు చేసిన కాఫీ స్టాల్‌ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పలువురు గిరిజన రైతులతో వారికి అందుతున్న ప్రభుత్వ సహకారం, గిరిజన ఉత్పత్తుల గిట్టుబాటు ధర తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. జీసీసీ ఎండీ బాబూరావు నాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.