బిజినెస్

చైనా ఆధ్వర్యంలో గద్వాలలో భారీ పట్టు పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో మల్బరీ పట్టుపురుగుల ఉత్పత్తుల పెంపకాలకు భారీగా రాయితీలను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. చైనా దేశం ఆధ్వర్యంలో త్వరలో గద్వాలలో భారీ పట్టుపరిశ్రమను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. పట్టుపురుగులకు ముడి పదార్థాలను పొరుగు ఉన్న కర్నాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, త్వరలో ఇక్కడే ముడి పదార్థలు తయారీ కేంద్రాలను నెలకొల్పడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. శనివారం మండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ మల్లేశం సభ చర్చల్లో మాట్లాడుతూ మల్బరీ సాగుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటో మంత్రి వివరించాలని సూచించారు. మంత్రి సమాధానం ఇస్తూ పట్టపురుగుల తయారీలో స్థానికంగా ఉన్న వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం పట్టపురుగులను పెంచుకోవచ్చునన్నారు. పట్టుపురుగులు ఉత్పత్తి కోసం కూలీలు ఉపాధి పనుల్లో భాగంగా పనులు చేసుకోవచ్చునని, అందుకు చట్టం కూడా ఉందన్నారు. పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా పట్టుపురుగుల పెంపకాల కోసం సమన్వయంతో పని చేయాలన్నారు.