బిజినెస్

ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఎగుమతిదారులు రియాల్టీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం 70 వేల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం పట్ల పారిశ్రామిక వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ చర్యలు నిర్ణయాత్మకంగా, సమగ్రంగా ఉన్నాయని అతి త్వరలోనే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదం చేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. పరిశ్రమలు ఆశించినట్లుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎగుమతులు పెంచడానికి రియాల్టీ రంగం పుంజుకోవడానికి దోహదం చేసే చర్యలను ప్రకటించారని తెలిపాయి. ఈ రెండు రంగాలు కూడా దీర్ఘకాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నాయని వాటిని సమగ్ర రీతిలో పరిష్కరించడానికి ఆర్థిక మంత్రి అవసరమైన చర్యలను ప్రకటించారని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. హౌసింగ్‌కు సంబంధించి కూడా పరిశ్రమ ఆశించినట్లుగానే కేంద్రం వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మందకోడిగా సాగుతున్న ఎగుమతులకు ఊతాన్ని ఇవ్వడానికి అత్యవసర చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ కొత్త పథకం వల్ల ఎగుమతిదారులు నష్టపరిహారాన్ని పొందగలుగుతారని ఆయన తెలిపారు. ఎగుమతులు ఆగిపోయినా రియాల్టీ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమని అసోచామ్ వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ మార్కెట్ పోటీని తట్టుకునే రీతిలో భారత్ ఎగుమతులను తీర్చిదిద్దడానికి ఆర్థిక మంత్రి చర్యలు తోడ్పడుతాయని అసోచామ్ అధ్యక్షుడు బీకే గోయంక అన్నారు. ఎగుమతులు హౌసింగ్ రంగం పుంజుకోవడానికి ఆర్థిక మంత్రి ప్యాకేజీ ఎంతో తోడ్పడుతుందని అఖిల భారత వర్తక సమాఖ్య తెలిపింది.