బిజినెస్

లడఖ్ లీడ్ బ్యాంక్ కావాలనుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిస్కిత్ (లడఖ్), సెప్టెంబర్ 14: దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్తగా ఏర్పాటయిన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి లీడ్-బ్యాంక్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. నుబ్రా లోయలోని మారుమూల పట్టణమయిన దిస్కిత్‌లో ఎస్‌బీఐ కొత్త శాఖను ఆ బ్యాంక్ చైర్మ న్ రజ్‌నీశ్ కుమార్ శనివారం ప్రారంభించారు. దీంతో ఇది లడఖ్ రీజియన్‌లో 14వ శాఖగా, మొత్తం మీద బ్యాంకు 22,024వ శాఖగా అవతరించింది. ప్రతి రాష్ట్రం లేదా రీజియన్ లీడ్-బ్యాంక్‌ను కలిగి ఉంటుంది. రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్‌గా రాష్ట్రం లేదా రీజియన్‌లో అవసరమయిన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండే బాధ్యతను లీడ్-బ్యాంక్ నెరవేరుస్తుంది. ప్రస్తుతం జేఅండ్‌కే బ్యాంక్ జమ్మూకాశ్మీర్, లడఖ్‌లకు లీడ్-బ్యాంక్‌గా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు అయిదో తేదీన జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేయడంతో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు- జమ్మూకాశ్మీర్, లడఖ్‌లుగా విభజించింది. ఎస్‌బీఐ చైర్మన్ శనివారం ఇక్కడ విడిగా విలేఖరులతో మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా ఉండటానికి ఇతర బ్యాంకులకు సమస్యలు ఉంటే, ఎస్‌బీఐ కన్వీనర్‌గా వ్యవహరిస్తుందని తెలిపారు. దిస్కిత్‌లో శాఖను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను మూడు నెలల ముందే రూపొందించామని ఆయన తెలిపారు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలకు సహకరించాలనే నిబద్ధతను ఎస్‌బీఐ కలిగి ఉందని కుమార్ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్, లడఖ్‌లలో ఎస్‌బీఐకి 185 శాఖలు ఉన్నాయి.