బిజినెస్

ఎగుమతులు, రియల్ ఎస్టేట్‌కు 70వేల కోట్ల ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఎగుమతుల సుంకాలను తగ్గించే విషయంలో పునరాలోచ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎగుమతులు, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్దీపన పథకాలను వివరించారు. 70 వేల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించారు. నిరర్ధక ఆస్తుల నిధి ఏర్పాటు కూడా జరుగుతుందని ఆమె వివరించారు. నిర్మాణ రంగానికి 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని, అందులో సగ భాగాన్ని చివరి క్షణాల్లో అత్యవసరంగా మారిన అవసరాల కోసం వినియోగిస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. గృహ నిర్మాణాలకు రుణాలను కల్పించే సంస్థలకు విదేశాల నుంచి నిధులను తెచ్చుకునే అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుత చట్టాలను సవరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. గృహ నిర్మాణాల అడ్వాన్స్‌పై వడ్డీ రేటును భారీగా తగ్గించినట్టు ఆమె గుర్తుచేశారు. దీనితో ప్రభుత్వోజ్యోలు గృహ నిర్మాణాలకు పూనుకుంటారని అమె అన్నారు. నిర్మాణ రంగంలో నిరర్ధక ఆస్తుల నిధి ఏర్పాటు
వల్ల 3.5 లక్షల మంది గృహాల కొనుగోలు దారులకు లాభం చేకూరుతుందని ఆమె అన్నారు. దివాలా ప్రాజెక్టుల్లో చిక్కుకున్న కంపెనీలకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ద్వారా ఊరట లభిస్తుందని ఆమె అన్నారు.
జనవరి నుంచి ఆర్‌ఓడీటీఈపీ పథకం
ఎగుమతులకు ఊతం ఇవ్వడానికి వీలుగా పలు చర్యలు తీసుకుంటున్నామని నిర్మాలా సీతారామన్ తెలిపారు. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ టాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (ఆర్‌ఓడీటీఈపీ) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఎగుమతుల కోసం చెల్లించిన పన్నుల రీయింబర్స్‌మెంట్‌కు దీని ద్వారా వీలవుతుందని అన్నారు. ఈ పథకం 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆమె చెప్పారు. ఎగుమతులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అన్ని చట్టాలను క్రోడీకరించి ఈ పథక రచన జరిగిందన్నారు. ఎగుమతుల ద్వారా లభించే సుమారు 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల కింద ఇప్పటికే కేంద్రం 40 నుంచి 45 వేల రూపాయల రిఫండ్స్ అందచేస్తున్న విషయాన్ని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అదుపులోనే మాంద్యం పరిస్థితులు
దేశంలో మాంద్యం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. గత ఆరేళ్ల కాలంలో ఎన్నడూ లేని రీతిలో దారుణంగా పడిపోయిన వృద్ధిరేటును పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె చెప్పారు. వృద్ధిరేటు 5 శాతానికి పడిపోవడం, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశాలేనని ఆమె అన్నారు. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పరిస్థితులు ఆశాజనకంగానే ఉంటాయని ఆమె అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వృద్ధిరేటు మళ్లీ పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా జీడీపీ పెరుగుదలకు తగిన పరిస్థితులు ఏర్పడతాయని ఆమె వ్యాఖ్యానించారు. ఎగుమతులకు వర్కింగ్ క్యాపిటల్‌ను అందచేస్తున్న బ్యాంకులకు ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) ద్వారా మద్దతునిస్తామని చెప్పారు. ఎక్కువ బీమా కవరేజ్ ఉండే వస్తువుల ఎగుమతుల కోసం వర్కింగ్ క్యాపిటల్‌ను అందచేసిన బ్యాంకులకు ఈసీజీసీ 1,700 కోట్ల రూపాయల వరకూ పరిహారాన్ని అందచేస్తుందని పేర్కొన్నారు.
ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి ఎగుమతి రుణాల అంశాన్ని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పరిశీలిస్తున్నదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందుకుగాను ఆర్బీఐ 35,000 నుంచి 68,000 కోట్ల రూపాయలను ఎగుమతి రుణాలుగా అందచేస్తుందని మంత్రి చెప్పారు. వివిధ దేశాలతో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కింద జరిగే ఎగుమతులపై విధించిన సుంకాల్లో రాయితీలు ఇచ్చే అంశంపై వివిధ సంస్థలతో కేంద్రం చర్చిస్తుందని అన్నారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతున్నదని చెప్పారు. కొన్ని నిర్ణయాలు వచ్చే నెల మొదటి వారంలోనే అమల్లోకి వస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు.

చిత్రం.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్