బిజినెస్

ప్రపంచ రికార్డు సృష్టిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 1: టెలికామ్ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి ముందే పెను సంచలనాలను సృష్టిస్తూ దేశ వ్యాప్తంగా నాలుగో తరం (4జి) మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వడివడిగా ముందుకు సాగుతున్న రిలయన్స్ జియో సాధ్యమైనంత త్వరలో 10 కోట్ల మంది ఖాతాదారులకు చేరువకావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘జియో టీమ్‌కు నేను ఎప్పుడూ అసాధ్యమైన లక్ష్యాలనే నిర్దేశిస్తున్నప్పటికీ వారు కూడా నా అంచనాలను అధిగమిస్తున్నారు. కనుక వారికి ఇప్పుడు మరో సరికొత్త లక్ష్యాన్ని నిర్ధేశిస్తున్నా. సాధ్యమైనంత త్వరలో 10 కోట్ల మంది ఖాతాదారులను జియో నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకొచ్చి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాలన్నది ఈ లక్ష్యం’ అని ఆర్‌ఐఎల్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ఈ లెక్కన నెలకు 250 కోట్ల గిగాబైట్ల డేటా వినియోగం అవుతుందని ఆయన చెప్పారు. గత కొన్ని వారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో తమ 4జి నెట్‌వర్క్‌ను పరీక్షించుకుంటున్న రిలయన్స్ జియో ప్రయోగాత్మక దశలోనే 15 లక్షల మంది ఖాతాదారులకు చేరువైంది. సోనీ, సాన్సూయ్, వీడియోకాన్, ఎల్‌జి, శ్యాంసంగ్, మైక్రోమ్యాక్స్, పానాసోనిక్, ఆసస్, టిసిఎల్, ఆల్కాటెల్ తదితర బ్రాండ్లకు చెందిన నాలుగో తరం మొబైల్ ఫోన్ల వినియోగదారులకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా 4జి సేవలను అందజేస్తున్న రిలయన్స్ జియో ఇప్పుడు తమ అపరిమిత ఉచిత కాల్స్, హైస్పీడ్ మొబైల్ బ్రాడ్‌బ్యాంట్ ట్రయల్ ఆఫర్‌ను హెచ్‌టిసి, ఇంటెక్స్, వివో, జియోనీ, కార్బన్, లావా తదితర బ్రాండ్లకు చెందిన నాలుగో తరం మొబైల్ ఫోన్ల వినియోగదారులకు కూడా విస్తరిస్తోంది. జియో 4జి ఫోన్ సర్వీసుల ద్వారా తమ ఖాతాదారులకు ఉచితంగా వాయిస్ కాలింగ్, రోమింగ్ సదుపాయన్ని కల్పించడంతో పాటు అతితక్కువ ధరకే డేటాను కూడా అందజేయనున్నట్లు ముఖేష్ అంబానీ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం భారత టెలికామ్ మార్కెట్‌లో దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి మొబైల్ ఆపరేటర్లకు పోటీగా రంగంలోకి దిగిన రిలయన్స్ జియో తమ ఖాతాదారులకు ఈ నెల 5వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు నాలుగు నెలల పాటు ఉచితంగా డేటా సర్వీసులను అందజేయనుంది. ఈ నాలుగు నెలల వ్యవధి ముగిసిన తర్వాత ఆ సంస్థ తమ వినియోగదారుల కోసం 10 టారిఫ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురానుంది. రోజుకు 19 రూపాయల (ఎప్పుడో ఒకసారి డేటా సేవలను ఉపయోగించుకునే వినియోగించుకునే ఖాతాదారుల కోసం) కనీస ధరతో ప్రారంభమయ్యే ఈ ప్లాన్ల కింద తక్కువ డేటాను ఉపయోగించుకునే వినియోగాదారుల నుంచి నెలకు 149 రూపాయలు, గరిష్ఠ స్థాయిలో డేటా వినియోగించుకునే వారి నుంచి నెలకు 4,999 రూపాయలు వసూలు చేస్తారు. ఈ ప్లాన్లకు సంబంధించిన వివరాలను రిలయన్స్ జియో గురువారం టెలికామ్ నియంత్రణా సంస్థ (ట్రాయ్)కి సమర్పించింది. ఈ ప్లాన్లకు ఎటువంటి ఆమోదం అవసరం లేదని, ప్రస్తుతమున్న నిబంధనల నుంచి ఎవరైనా పక్కకు జరిగినప్పుడే ట్రాయ్ జోక్యం చేసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇంటర్ కనెక్టివిటీ అందరి బాధ్యత..
ఇదిలావుంటే, ప్రస్తుతమున్న నెట్‌వర్క్‌లలో ఇంటర్ కనెక్టివిటీ సమస్యల కారణంగా రిలయన్స్ జియో ఖాతాదారులు గత వారం 5 కోట్ల కాల్ ఫెయిల్యూర్లతో ఇబ్బందులు ఎదుర్కోవడంపై ముఖేష్ అంబానీ విచారాన్ని వ్యక్తం చేశారు. ఎటువంటి జాప్యం లేకుండా ఇంటర్ కనెక్టివిటీని అందజేసి ఆపరేటర్లు తమ బాధ్యతను నెరవేర్చాలని, తద్వారా రిలయన్స్ జియో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌లోకి మారుతున్న ఖాతాదారులను ఏ ఆపరేటర్ ఆడ్డుకోరాదని, వినియోగదారులు స్వేచ్ఛగా నంబర్ పోర్టబిలిటీ హక్కును ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాల్సిన బాధ్యత కూడా ఆపరేటర్లపై ఉందని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు.

చిత్రం.. ముంబయలో గురువారం ఆర్‌ఐఎల్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశానికి
కుమారుడు ఆకాష్‌తో కలసి హాజరవుతున్న ముఖేష్, నీతా అంబానీ దంపతులు