బిజినెస్

నింగికెక్కిన నిమ్మ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, సెప్టెంబర్ 16: దేశ వ్యాప్తంగా నెల్లూరు జిల్లా గూడూరు నిమ్మ మార్కెట్‌కు ఎనలేని పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇందులో భాగంగానే నిమ్మ ధర గత రెండు రోజులుగా నింగికెక్కి కూర్చుంది. లూజు నిమ్మ ధర రూ.16 వేలకు పెరగడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజీ ధర రూ.200 పలుకుతుండగా, ఒక్క నిమ్మ పండు రూ.10 పలుకుతోంది. వాస్తవంగా గత నెలలో అమావాస్య వినాయక చవితి సందర్భంగా రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు నిమ్మ ధర అధికంగా పలికింది. అయితే వర్షాభావ పరిస్థితుల వలన కాయలు తక్కువగా ఉండటంతో ఇక్కడి వ్యాపారులు తెలంగాణలోని నకిరేకల్, ఆంధ్రాలోని ఏలూరు, గుజరాత్ నుంచి భారీగా నిమ్మకాయలు గూడూరు మార్కెట్‌కు దిగుబడి చేసుకున్నారు. గూడూరు నిమ్మ మార్కెట్‌లో ప్రస్తుతం రూ.16 వేల వరకు లూజు ధర పలుకుతుండటంతో ఈ ప్రాంత వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈప్రాంతంలో వర్షాభావంతో పంట దిగుబడి లేక రైతులు మాత్రం డీలాపడిపోతున్నారు.
ధరల్లో హెచ్చు తగ్గులు మామూలే..!
గూడూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు పెరగడం, తగ్గడం మామూలేనని నిమ్మ వ్యాపారులు తలమంచి సిద్దారెడ్డి అన్నారు. గూడూరు నిమ్మ మార్కెట్‌లో ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నామని, అయితే ఒక్కోసారి నిమ్మ ధరలు అధికం కావడం మరికొన్నిసార్లు తగ్గడం వ్యాపారంలో మామూలేనని తెలిపారు.
*చిత్రం... గూడూరు మార్కెట్‌ను ముంచెత్తిన నిమ్మ పళ్లను గ్రేడింగ్ చేస్తున్న కూలీలు