బిజినెస్

ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: సుమారు ఆరు కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులు 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును పొందుతారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ మంగళవారం నాడిక్కడ తెలిపారు. పండుగ రోజుల్లో ఇది ప్రభుత్వ కానుకగా భావించాలని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రతా పురస్కారోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఉద్యోగుల భవిష్యనిధి నిర్వహణ సంస్ధ (ఈపీఎఫ్‌ఓ)కు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం గత ఫిబ్రవరి 21న ఈ మేరకు 8.65 శాతం వడ్డీరేటుకు ఆమోదం తెలిపిందన్నారు. ఈప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపడం జరిగిందని, అక్కడ గ్రీన్‌సిగ్నల్ లభించిన వెంటనే 8.65 శాతం వడ్డీరేటు లబ్థిదారుల ఖాతాల్లోకి జమవుతుందని ఆయన వివరించారు. అప్పుడు అన్ని క్లెయిమ్‌లను కొత్త వడ్డీరేటుతో సెటిల్మెంట్లు జరుగుతాయన్నారు. ప్రస్తుతం 2017-18లో ఆమోదం పొందిన 8.55 శాతం వడ్డీరేటుతో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని మంత్రి గాంగ్వర్ తెలిపారు. ఆర్థిక మం త్రి నిర్మలా సీతారామన్ ఇతర కార్యక్రమా ల్లో తలమునకలై ఉన్నందువల్ల కొత్త వడ్డీరేటు అమలులో ఆలస్యం చోటుచేసుకుందని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆ యన సమాధానమిచ్చారు. ఐనా ఆమె ఈ విషయంలో విముఖత వ్యక్తం చేయడం లేదని స్పష్టం చేశారు. మరికొన్ని రోజుల్లో ఈప్రక్రియ పూర్తవుతుందన్నారు.
జమ్మూ కాశ్మీర్-లడక్‌లకు సరికొత్త వౌలిక వసతులు
కొత్తగా ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలు రెండింటికీ సరికొత్త వౌలిక వసతులు అక్కడి తమ శాఖకు చెందిన విభాగాల ద్వారా ఏర్పాటవుతాయని కార్మిక మంత్రి గాంగ్వర్ తెలిపారు. ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) నేతృత్వంలో లెహలో 30 పడకల ఆస్పత్రి, శ్రీనగర్‌లో 100 పడకల ఆస్పత్రి ఏర్పావుతాయన్నారు. అలాగే ఈపీఎఫ్‌ఓ ద్వారా శ్రీనగర్, జమ్మూల్లో కార్యాలయాలు ఆరంభమవుతాయని, అలాగే లెహలో సైతం ఈ కార్యాలయ అవశ్యకత ఉందని మంత్రి వివరించారు. జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించిన తర్వాత దాదాపు 106 కేంద్ర చట్టాలను ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 31 నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. ఈ చట్టాలు సక్రమంగా అమలు జరగాలంటే తగిన వౌలిక వసతులు అవసరమని వివరించారు. ప్రధానంగా అక్కడ నిరుద్యోగ సమస్యను రూపుమాపే విషయంలో కేంద్రం కృతనిశ్చయంతో ఉందని గాంగ్వర్ తెలిపారు. దేశంలో 20 లేదా అంతకుమంచిన సంఖ్యలో కార్మికులున్న అన్ని విభాగాల్లో కలుపుకుని కార్మికుల సంఖ్య దాదాపు రెండు కోట్లు పెరిగిందని ట్లకు, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 8 కోట్లకు చేరుతుందన్నారు. దేశంలో అసంఘటిత రంగంలో కార్మికుల సంఖ్యను 40 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందేలా చేయాలన్న లక్ష్యం ప్రభుత్వానికి ఉందన్నారు. దేశంలోని నిరుద్యోగితపై స్పష్టమైన వివరాలు సేకరించే పనిలో ఉన్నామన్నారు.