బిజినెస్

మూసివేత లేదా విలీనానికి చేరువలో ఎంఎంటీసీ, ఎస్‌టీసీ, పీఈసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రభుత్వ రంగ సంస్థలైన ఎంఎంటీసీ, ఎస్‌టీసీ, పీఈసీలను మూసివేయడం లేదా విలీనం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అన్ని రకాల ఇచ్చికాలూ ఉన్నాన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయెల్ మంగళవారం నాడిక్కడ తెలిపారు. ఈ మూడు సంస్థల స్థాపనకు సంబంధించిన లక్ష్యాలు క్రమంగా దెబ్బతిన్నాయని, వీటిని ఇక పునరుద్ధరించ గలిగే స్థితికూడా లేదని ఆయన స్పష్టం చేశా రు. ఐతే వాణిజ్య వ్యవహారాల్లో తలదూర్చడం ప్ర భుత్వ విధానం కాదని విలేఖరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఎంఎంటీసీ లాంటి సంస్థతో బంగారం దిగుమతి లాంటి కార్యకలాపాలు సా గించలేము. కాబట్టి దీనిపై ప్రస్తుతం కూలంకషంగా చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎస్‌టీసీ, పీఈసీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయన్నారు. ఎస్‌టీసీ సంస్థ 2018-19 వార్షిక నివేదిక మేరకు ఆ కంపెనీ తీవ్ర ద్రవ్యలోటును ఎదుర్కొంటోందని, అన్ని బ్యాంకులకు వడ్డీలు చెల్లించడంలో చోటుచేసుకున్న వైఫల్యంతో ఈ కంపెనీ నిరర్ధక ఆస్తి జాబితాలో చేరిపోయిందని మంత్రి తెలిపారు. ఈకంపెనీ ప్రస్తుతం బ్యాంకుల పరిధిలో లేదని, అలాగే నిధుల సమీకరణకు లేదా ఇచ్చేందుకు సైతం అవకాశం లేదన్నారు. మొత్తం రూ. 881 కోట్ల నికర నష్టాన్ని గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ మూటగట్టుకుందన్నారు. ఈ కంపెనీ పద్దుఖాతాల్లోని రూ. 626 కోట్లు మాఫీ చేసిన దరిమిలా ఈ నష్టాలు వచ్చాయన్నారు. 1956లో ఓ వాణిజ్య సంస్థగా ఎస్‌టీసీ ఏర్పాటైందని, ఐరోపా దేశాలతో ప్రభుత్వం నెరపే వాణిజ్య కార్యకలాపాలను ఈ కంపెనీ పర్యవేక్షించేదని మంత్రి గుర్తు చేశారు. అలాగే ఎస్‌టీసీ అనుబంధ సంస్థగా పీఈసీని 1971లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైల్వే, ఇంజనీరింగ్ పరికరాల ఎగుమతులను ఈ సంస్థ పర్యవేక్షించేదన్నారు. 1997లో ఈ కంపెనీ స్వతంత్ర ప్రతిపత్తిని పొందిందన్నారు. అలాగే ఎంఎంటీసీ 1963లో ఏర్పాటైందని అతివిలువైన లోహాలు, ఖనిజాలను ఎగుమతులను ఈ సంస్థ పర్యవేక్షించేదని తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు కంపెనీల ఏర్పాటు లక్ష్యాలు నీరుగారాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్‌టీసీ ఎంఎంటీసీ వాటాలు మంగళ వారం 20 శాతం నష్టపోయాయి.