బిజినెస్

ఎలక్ట్రానిక్ హబ్‌గా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 17: రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్‌గా తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో ఫాక్స్‌కాన్ ఇండియా సంస్థ ఎండీ జోష్ ఫాల్గర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను ఫాల్గర్ వివరించారు. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో ఉన్న తమ సంస్థ ద్వారా 15 వేల మందికి ఉపాధి కల్పించామని, వారందరికీ వృత్తిపరమైన శిక్షణ కూడా ఇచ్చామన్నారు. కంపెనీ ఉత్పాదక సామర్థ్యాన్ని విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకు 35 లక్షల సెల్‌ఫోన్‌లు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని చెప్తూ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఉత్తమ నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఆ దిశగా ఫాక్స్‌కాన్ ఇండియా కూడా ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
*చిత్రం... ఫాక్స్‌కాన్ ఎండీ ఫాల్గర్‌కి జ్ఞాపిక బహూకరిస్తున్న జగన్మోహన్‌రెడ్డి