బిజినెస్

ఆర్‌ఐసిహెచ్‌తో పరిశోధనలకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: పరిశోధనలను ప్రోత్సహించే విధంగా రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (ఆర్‌ఐసిహెచ్)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు తెలం గాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. తెలంగాణను దూ సుకెళ్తున్న రాష్ట్రంగా అభివర్ణిం చిన ఆయన శనివారం ఇక్కడ స్టార్టప్ కాన్ఫరెన్స్ ఆగస్ట్ ఫెస్ట్‌ను ప్రారంభించారు. పశ్చిమ దేశాల్లో విశ్వవిద్యాలయాల్లోనే పరిశోధనలు జరుగుతాయని, ఈ విషయంలో మనం పశ్చిమ దేశాల నుంచి చాలా నేర్చుకోవలసి ఉంద న్నారు. వాణిజ్య పరంగా పరిశోధనలను ప్రోత్సహించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్‌ఐసిహెచ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణలో దాదాపు 30 పరిశోధనా కేంద్రాలున్నాయని, ఎన్‌ఐఆర్‌డి, సిఎస్‌ఐఆర్, ఐఐసిటి వంటి ప్రముఖ పరిశోధనా సంస్థలు పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి-హబ్ మంచి ప్రభావం చూపిస్తోందని, సిలికాన్ వ్యాలీలో ఒక చాప్టర్‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. కాగా, రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, వివిధ నూతన సంస్థల ప్రతినిధులు రెండవ రోజు కాన్ఫరెన్స్‌లో తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

చిత్రం..ఆగస్ట్ ఫెస్ట్‌లో మాట్లాడుతున్న కెటిఆర్