బిజినెస్

పెరిగిన మదుపర్ల సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సంపద శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 6.82 లక్షల కోట్లు పెరిగింది. కార్పొరేట్ పన్ను వెసులుమాట్లతో కేంద్రం ఆర్థిక ఉద్దీపనకు ఊతం ఇవ్వడంతో ఇంట్రాడేలో సెనె్సక్స్ 1,921.15 పాయింట్లు ఎగబాకి దశాబ్ధకాలపు గరిష్ట లాభాలను నమోదు చేయడం జరిగింది. ఈక్రమంలో బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ విలువ రూ. 6,82,938.6 కోట్ల రూపాయలు పెరిగింది. మొత్తం విలువ రూ. 1,45,37,378.01 కోట్లకు చేరింది. కార్పొరేట్ కంపెనీల పన్నును 25.17 శాతానికి, తయారీ రంగం పన్నును 17.01 శాతానికి పరిమితం చేస్తూ కేంద్రం సవరణలు చేయడం స్టాక్ మార్కెట్లలో కార్పొరేట్, తయారీ రంగ కంపెనీల పంట పండింది. నిఫ్టీ 5 శాతం లాభపడి చరిత్ర సృష్టించడం దేశ సమూల ప్రగతికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. బీఎస్‌ఈ 30 కంపెనీల్లో 25 అత్యధిక లాభాలను అందుకున్నాయి. ఈ ప్యాక్‌లో 1,864 వాటాలు లాభపడగా, 728 నష్టపోయాయి, 144 వాటాలు స్తబ్థుగా మిగిలాయి. రంగాల వారీగా వాహన, బ్యాంకెక్స్, కేపిటల్ గూడ్స్, వినిమయ వస్తువులు, ఫైనాన్స్, ఇంధన, చమురు, సహజవాయువులు, లోహ, టెలికాం సూచీలు లాభాల పరుగులుతీసి 9.85 శాతం లాభపడ్డాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు సైతం 6.28 శాతం లాభాలను సంతరించుకున్నాయి.