బిజినెస్

ఆహారశుద్ధి, ఆటోమొబైల్ రంగాల్లో సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో ఆటోమొబైల్, ఆహారశుద్ది రంగాలతో పాటు రొయ్యల సాగు, మామిడి ఎగుమతి రంగాల్లో సహకరించాలని దక్షిణ కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రతిపాదించారు. దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ ఇన్ బూసన్ జంగ్ డియోక్ మిన్ నేతృత్వంలో పలు పారిశ్రామిక సంస్థల ప్రతినిధుల బృందం శుక్రవారం సచివాలయంలో సీఎస్‌తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్‌కల్లాంతో స మావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రం లో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సా ధిస్తోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువ ఆధారిత సేవలను జోడించేందుకు కృషి జరుగుతోందని వివరించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా రొ య్యల ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. ఈ రంగంలో మరింత మెరుగైన సేవలందించేందుకు కొరియన్ సంస్థలు ముం దుకు రావాలని ఆకాంక్షించారు. విశాఖప ట్నం- చెన్నై, బెంగుళూరు- చెన్నై పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి జరుగుతోందని, ఈ క్లస్టర్లలో ఆటోమొబైల్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరా రు. మామిడిపం డ్లు, మిర్చి ఉత్ప త్తి, ఎగుమతిలో రాష్ట్రం ముందంజలో ఉందని, వాటిని ప్రోత్సహించేందుకు తోడ్పా టు నందించాలన్నారు. కొరియన్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లు రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలను ఎంపికచేసి విద్యావ్యాప్తికి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. పీపీపీ తరహాలో వౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్‌ల స్థాపనకు కొరియా ఏఎంఇ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నైపుణ్యతా శిక్షణలో సహకారాన్ని అందించాలన్నారు. రాష్ట్రం లో భూముల సర్వే జరుగుతోందని బ్లాక్‌చైన్ టెక్నాలజీతో గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. అజయ్ కల్లం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆహారశుద్ది, వౌలిక సదుపాయా ల రంగాల్లో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రం మామిడి, మిర్చి, పొగాకు, వరి, పత్తి, వివిధ చిరు ధాన్యాల పంటలకు పేరుగాంచిందని, వీటి ఎగుమతులు, విలువ ఆధారిత సేవలకు సహకరించాలన్నారు. కొరియన్ ఇండస్ట్రియల్ కాం ప్లక్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించా రు. ష్రింప్ కాపిటల్‌గా రూపుదిద్దుకుంటున్న రొ య్యల ఎగుమతికి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. జంగ్ డియోక్ మిన్ మాట్లాడుతూ గతం లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏపీలో కొరియన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పారిశ్రామిక, విద్య, వ్యవసా యం, ఐటీ, మత్స్య, ఆరోగ్య రంగాల్లో ఏపీతో కలసి పనిచేందుకు కొరియన్ సంస్థలు సుముఖంగా ఉన్నాయని వెల్లడించారు.