బిజినెస్

స్టాక్ మార్కెట్లకు లాభాల కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 20: వివిధ కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా మరోదఫా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపనకు ఊతం ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వాయువేగంతో లాభాల పరుగులు పెట్టాయి. సుమారు దశాబ్ధ కాలానికిపైగా కనీవినీ ఎరుగని రీతిలో సూచీలు భారీ గరిష్టాలను నమోదు చేశాయి. చిరకాలం గుర్తుండేలా అతిపెద్ద ఇంట్రాడే లాభాల నమోదుకు ముందు ఆరంభం మాత్రం చాలా మందకొడిగా సాగింది. ఐతే గోవాలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మాంద్యానికి మందులా ప్రకటించిన కార్పొరేట్ కంపెనీల పన్ను వెసులుబాట్లతో సూచీలు ఒక్కసారిగా పరుగులంఘించుకున్నాయి. భారీగా వాటాల కొనుగోళ్లు చోటుచేసుకుని లాభాల కుంభవృష్టి జరిగింది. బీఎస్‌ఈ 30షేర్ల సూచీ సెనె్సక్స్ దూకుడు ప్రదర్శించి ఏకంగా 2,284.55 పాయింట్లు ఎగబాకి 38,378.02 పాయింట్ల అతిభారీ గరిష్టానికి చేరింది. చివరిగా కొంత దిగివచ్చి 1,921.15 పాయింట్ల ఆధిక్యతతో 5.32 శాతం లాభాలతో 38,014.62 పాయింట్ల భారీ గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇది దశాబ్ధ కాలపు గరిష్ట స్థాయి అని వాణిజ్య నిపుణులు తెలిపారు. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ సైతం ఇది వరకెన్నడూ లేని రీతిలో వేగంగా పరుగులు తీసి 569.40 పాయింట్లు (5.32శాతం) అదనంగా లాభపడి మళ్లీ కీలక 11వేల పాయింట్ల స్థాయిని దాటి 11,274.20 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. కార్పొరేట్ కంపెనీలకు ఇప్పటి వరకు విధిస్తున్న పన్నుల్లో దాదాపు 10 శాతం కోత విధించి 25.17 శాతానికి పరిమితం చేస్తూ ఆసియాలో వాణిజ్య పోటీదారులైన చైనా, దక్షిణ కొరియాలతో సమాన స్థాయికి ఈ పన్నులను సవరించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం జీఎస్‌టీ మండలి సమావేశానంతరం ప్రకటించడం జరిగింది. అలాగే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో పెంచిన ఈక్విటీ వాటాల విక్రయాలకు సంబంధించి కంపెనీలకు సంక్రమించే మూలధనంపై విధించిన అదనపు సర్‌చార్జీని వసూలు చేయబోవడం లేదని సైతం మంత్రి ప్రకటించారు. అలాగే విదేశీ పెట్టుబడులకు సంబంధించి డెరివేటివ్‌ల వంటి వాటితోకూడిన సెక్యూరిటీల విక్రయంపై వచ్చే మూలధన లాభాలపై పెంచిన అతి సంపన్న వర్గాల (సూపర్ రిచ్) పన్నును సైతం అమలు చేయడం లేదని ప్రకటించారు. గత జూలై 5కు ముందు వరకు వాటాల బైబ్యాక్ ప్రకటించిన కంపెనీలకు సూపర్ రిచ్ పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. ఈక్రమంలో తయారీ, నిర్మాణ, ఇంధన రంగాల వంటి వాటిలో తరలిపోయిన పెట్టుబడులు మళ్లీ మొదలై దీర్ఘ కాలంపాటు సాగే అవకాశం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇలావుండగా సెనె్సక్స్ ప్యాక్‌లో హీరో మోటోకార్ప్, మారుతి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ అత్యధికంగా 12.52 శాతం లాధపడ్డాయి. మరోవైపు ఇంత లాభాల దూకుడులోనూ పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా 2.39 శాతం నష్టపోయాయి.
బలపడిన రూపాయి..
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం 29 పైసలు బలపడి 71.04గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు శుక్రవారం సైతం 0.64 శాతం పెరిగాయి. బ్యారెల్ 64.84 డాలర్లు వంతున ట్రేడైంది. ఇక ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, నిక్కీ, కోస్పి లాభాలతో, హ్యాంగ్‌సెంగ్ నష్టాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభలతోనే సాగాయి.