బిజినెస్

పెట్టుబడులకు ఏపీ అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ జంగ్ డోక్ మిన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. స్టీల్, ఆహార ఉత్పత్తులకు సంబంధించి భేటీలో చర్చించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దక్షిణ కొరియా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా చొరవ చూపాలని జంగ్‌ను కోరారు. ఆ దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించాలని సూచించారు. సముద్ర ఆహారపు ఉత్పత్తులు, మామిడి ఉత్పాదకాల ఎగుమతుల్లో నాణ్యత ఉండేలా చూసేందుకు తగిన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు రాష్ట్రంలో ఒక ప్రతినిధిని నియమించాలన్నారు.