బిజినెస్

కంపెనీలకు సానుకూలమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వ ఆర్థిక సంకటాలు పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడి, బలహీన కార్పొరేట్ సెంటిమెంట్, ఆర్థిక వ్యవస్థలో రుణ ప్రవాహం నెమ్మదించడం వంటి చక్రీయ అంశాల నుంచి ఎదురుగాలులు సమీప భవిష్యత్తులో వృద్ధికి ప్రమాదంగా పరిణమిస్తాయని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ శనివారం పేర్కొంది. మందగించిన ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పునరుద్ధరించడానికి చేపట్టిన ఉద్దీపన చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మూల కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పునరుద్ధరించడానికి కార్పొరేట్ పన్ను రేటును తగ్గించడం వల్ల కార్పొరేట్ పన్ను చెల్లించే వర్గాలలో ఏర్పడే బలమయిన ఉత్సాహం ప్రభుత్వం కోల్పోయే ఆదాయాన్ని పూడ్చుతుందని తాను భావించడం లేదని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. 3్భరత కార్పొరేట్ పన్ను రేటు తగ్గడం దేశాన్ని ఆసియాలోని తన ప్రత్యర్థి దేశాల స్థాయికి దగ్గరగా చేరుస్తుంది. వ్యాపార వాతావరణానికి, పోటీతత్వానికి మద్దతుగా నిలుస్తుంది. అయితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడి, బలహీనమయిన కార్పొరేట్ సెంటిమెంట్, ఆర్థిక రంగంలో నెమ్మదించిన రుణ ప్రవాహం సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎదురుగాలులుగానే ఉంటాయి2 అని మూడీస్ పేర్కొంది. కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు కంపెనీలకు సానుకూలాంశమేనని, ఎందుకంటే అవి తమ పన్ను చెల్లింపు తరువాత ఆదాయాన్ని పెంచుకోగలుగుతాయని మూడీస్ వివరించింది. 3అయితే, ప్రభుత్వానికి ఇది ప్రతికూలాంశమే అవుతుంది. ఎందుకంటే, ప్రభుత్వం తన ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది అడ్డంకిగా మారుతుంది2 అని మూడీస్ విశే్లషించింది. కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు వల్ల కమాడిటి, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) సేవల కంపెనీలు బాగా లబ్ధి పొందుతాయి. 3అయితే, కార్పొరేట్ క్రెడిట్ ప్రొఫైల్‌లు ఎంతమేరకు బలపడతాయనేది కంపెనీలు తమ అదనపు ఆదాయాలను తిరిగి తమ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడంపై లేదా తమ రుణాలను తగ్గించుకోవడంపై లేదా భాగస్వాముల ఆదాయాలను పెంచడంపై ఆధారపడి ఉంటుంది2 అని మూడీస్ పేర్కొంది.