బిజినెస్

నాన్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం ఆదాయం 17 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలోని నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు గడచిన ఆగస్టు మాసంలో కొత్త కంబైన్డ్ ప్రీమియం వసూళ్లలో 17 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
మొత్తం రూ. 15,964 కోట్ల మొత్తాన్ని వసూలు చేశాయి. మొత్తం 34 ఇన్సూరెన్స్ కంపెనీలు స్థూల ప్రీమియం వసూళ్లు గత ఏడాది ఇదే కాలంలో రూ. 13,657.51 కోట్లుగా నమోదైంది. ఇందులో 25 జనరల్ ఇన్సూరెన్స్ కంపెలు గత ఆగస్టులో కంబైన్డ్ ప్రీమియం రూ. 12,447.10 కోట్లు వసూలు చేశాయి. గడచిన ఏడాదికంటే ఇది 12 శాతం అధికం. అలాగే ఏడు ప్రైవేటు రంగ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 33 శాతం వృద్ధితో మొత్తం రూ. 1,070.29 కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం జరిగింది.
అలాగే రెండు ప్రభుత్వ రంగ ప్రత్యేక కంపెనీలు భారత వ్యవసాయ బీమా కంపెనీ, ఈసీజీసీ లిమిటెడ్ 42 ఏకంగా శాతం వృద్ధిని నమోదు చేసి మొత్తం రూ. 2,446.61 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని రాబట్టాయి. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) గణాంకాల మేరకు గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 34 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం వసూళ్లు 14 శాతం వృద్ధితో రూ. 71,415.09 కోట్లకు చేరాయి.