బిజినెస్

ఈ వారం స్టాక్ మార్కెట్ల లాభాల పరుగుకు విరామం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు వాయువేగ పరుగుకు ఈవారం కొంత విరామం ఏర్పడే అవకాశం ఉందని, ఊపిరి తీసుకునే వీలుందని విశే్లషకులు భావిస్తున్నారు. గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మాంద్యానికి మందువేసేలాప్రకటించిన మరోదఫా ఉద్దీపన చర్యలతో అటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ పదేళ్ల గరిష్ట స్థాయి ఆధిక్యతలను నమోదు చేసి లాభాల కుంభవృష్టి కురిపించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మొత్తం మీద మార్కెట్ సెంటిమెంట్ ఉచ్ఛస్థితిలోనే కొనసాగే అవకాశాలున్నాయని అంటున్నారు. గత వాణిజ్య వారం చివరి రోజైన శుక్రవారం సెనె్సక్స్ అత్యధిక ఒకరోజు ఆధిక్యత 1,921 పాయింట్లు నమోదు చేసింది. విదేశీ పోర్టుపోలియో పెట్టుబడిదారుల నుంచి జరిగే డెరివేటివ్స్ వంటి అన్ని సెక్యూరిటీల విక్రయాల ద్వారా సమకూరే మూలధన లాభాలపై పెంచిన సర్‌చార్జిని అమలు చేయబోవడంలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించడం విదేశీ పెట్టుబడులకు ఊతమిస్తుందని విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే విశిష్ట అధికారాలు గల జీఎస్‌టీ మండలి హోటళ్లకు సంబంధించిన టారిఫ్‌లపై, కొన్ని వస్తువులపై పన్నుల కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలనిస్తుందని అంటున్నారు. ఐతే మార్కెట్లు ఈవారం కొంత పరుగును తగ్గించి విరామం తీసుకునే అవకాశం ఉందని ప్రముఖ విశే్లషకుడు జిమీత్ మోదీ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల వౌలికపన్ను 30 శాతం నుంచి 22 శాతానికి కోత విధించడం, అక్టోబర్ 1 తర్వాత నెలకొల్పే కొత్త తయారీ సంస్థలకు విధించే పన్నును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడం వల్ల వృద్ధిరేటు, పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేస్తుందని అంటున్నారు. 1991 తర్వాత ఇదే అత్యధిక పన్నుకోతగా విశే్లషకులు చెబుతున్నారు. ఇలావుండగా గత వాణిజ్య వారంలో సెనె్సక్స్ 626.63 పాయింట్లు, నిఫ్టీ 198.30 పాయింట్ల వంతున అదనంగా లాభపడ్డాయి. వచ్చేవారం నిఫ్టీ తన లాభాల పరుగు కొనసాగే అవకాశం ఉందని, ప్రత్యేకించి వాహన, స్థిరాస్తి, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరిగి తద్వారా నిఫ్టీ 11,500 మార్కును అందుకునే అవకాశం ఉందని మరో విశే్లషకుడు రొమేష్ తివారీ తెలిపారు. ఈవారం ప్రత్యేకించి కార్పొరేట్ కంపెనీల ఫలితాలు, ఆర్థికాభివృద్ధి గణాంకాలేవీ వెలువడే అవకాశం లేనందున ప్రధానంగా రూపాయి మారకం విలువ, ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడులు దేశీయ మార్కెట్లును ప్రభావితం చేస్తాయని అంటున్నారు.