బిజినెస్

వెండి పైపైకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పడుతూ.. లేస్తూ పరుగులు పెడుతున్నాయి. పసిడి ధర 31,000 రూపాయలను చేరితే, వెండి ధర 46,000 రూపాయలకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ మార్కెట్‌లో జ్యుయెలర్ల కొనుగోళ్ల ఉత్సాహం మధ్య 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర శనివారం ట్రేడింగ్‌లో శుక్రవారం ముగింపుతో పోల్చితే 30 రూపాయలు పెరిగి 31,000 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 30,850 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర మాత్రం శనివారం ట్రేడింగ్‌లో భారీగా పుంజుకుంది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక రంగం నుంచి కొనుగోళ్లు పెరగడంతో ఈ ఒక్కరోజే కిలో ధర 800 రూపాయలు ఎగిసి 45,900 రూపాయలను తాకింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలను అందుకోకపోవడంతో అక్కడి పెట్టుబడులు స్టాక్ మార్కెట్లలోకి కాకుండా బంగారం వైపు మళ్లాయి. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.7 శాతం పెరిగి 1,326.70 డాలర్లు పలికింది. వెండి ధర కూడా 2.2 శాతం వృద్ధి చెంది 19.36 డాలర్లను చేరింది.