బిజినెస్

అదంత సులువు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: రఘురామ్ రాజన్ రూటే సపరేటు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన సాయం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి ప్రభుత్వం ప్రత్యేక డివిడెండ్‌ను తీసుకోవాలన్నదానిపైనా ఆయన అలాగే స్పందించారు. అలా కుదరదని తెగేసి చెప్పారు. ‘ఏవీ ఉచితంగా దొరకవు’. అన్నది ఆర్థిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రమన్న ఆయన ఆర్‌బిఐ డివిడెండ్ విషయంలోనూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాజన్‌కు ఆదివారంతో ఆర్‌బిఐ గవర్నర్ పదవీకాలం తీరిపోతున్నది తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆయన ఇక్కడి సెయింట్ స్టిఫెన్స్ కళాశాలలో ఆర్‌బిఐ గవర్నర్ హోదాలో ‘ఇండిపెండెన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్’ అంశంపై తన చివరి ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన ఆయన ఈ సందర్భంగా ఇటీవలి ఆర్థిక సర్వేలో ప్రభుత్వరంగ బ్యాంకులకు కావాల్సినంత నిధులు సమకూరాలంటే ఆర్‌బిఐ ప్రభుత్వానికి ప్రత్యేక డివిడెండ్ ఇవ్వాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ చేసిన సూచనపై స్పందించారు. అలా చేస్తే ఆర్‌బిఐ ఎక్కడి నుంచి ఆదాయం పొందిందో మళ్లీ అక్కడికే దాన్ని పంపించినట్లవుతుందని, ఇదంత సులభం కాదన్నారు. ఇది ఆర్‌బిఐ అదనంగా డబ్బులు ముద్రించినదానితో సమానమన్నారు. రాజన్ స్థానంలో ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ వస్తున్నది తెలిసిందే. మరోవైపు ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజన్‌కు శనివారం ఫేర్వెల్ డిన్నరిచ్చింది.

చిత్రం..విద్యార్థులతో మాట్లాడుతున్న రాజన్