బిజినెస్

ఎన్నాళ్లకెన్నాళ్లకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, సెప్టెంబర్ 3: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పదకొండేళ్లలో తొలిసారి లాభాలను అందుకుంది. ఈ లో-కాస్ట్ ఇంటర్నేషనల్ క్యారియర్ 2005 నుంచి లాభాలనే ఎరుగలేదు. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరం (2015-16) 361.68 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. దీన్ని ఎయిర్‌లైన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ధ్రువీకరించగా, ఈ వివరాలను శనివారం ఓ ప్రకటనలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) 61 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినట్లు తెలిపింది. కాగా, ప్రయాణికుల రవాణా పెరగడం లాభాలకు దోహదపడిందని సంస్థ పేర్కొంది. క్రిందటిసారి 2.62 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిస్తే.. ఈసారి ఈ సంఖ్య 2.80 మిలియన్లకు చేరుకుంది. ఆదాయం ఈసారి 2,917.96 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,622 కోట్ల రూపాయలుగా ఉంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు మొత్తం 17 విమానాలున్నాయి. నిరుడు కూడా ఇనే్న ఉన్నాయ.