బిజినెస్

ఆంధ్రాలో గూగుల్ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 6: ఇక్కడికి సమీపంలోని నంబూరులో గల వివిఐటి కళాశాలలో గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఫండమెంటల్స్‌పై ఐదు రోజుల పాటు జరిగే రాష్టస్థ్రాయి వర్క్‌షాప్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. వర్క్‌షాపులో గూగుల్ అమెరికాకు చెందిన హిల్లరి పియర్స్, నికిటా గామోల్స్కీ, అలెక్స్ హక్కీ, బోసిలిన్ బెకర్, పియోస్ సరస్వత్ శిక్షణ ఇవ్వనున్నారని చెప్పారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సుమారు 100 కళాశాలల నుంచి 230 మంది పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎపి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిఇఒ, ఎండి గంటా సుబ్బారావు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, మొబైల్ టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రస్తుతం వాడే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో 85 శాతం గూగుల్ ఆండ్రాయిడ్ అప్లికేషనే్ల ఉన్నాయన్నారు. కొత్త యాప్స్ ప్రజల అవసరాల కోసం రూపొందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలోనూ ఉద్యోగమేళాను నిర్వహించాలని చెప్పినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ యాప్స్ రూపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయన్నారు. వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ గూగుల్ వంటి సంస్థ తమ కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌లో మొదటిగా నైపుణ్యాభివృద్ధిపై వర్క్‌షాప్‌ను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గూగుల్ అమెరికాకు చెందిన పియో సరస్వత్ మాట్లాడుతూ గూగుల్ 20 లక్షల మంది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలపర్స్‌ను తయారు చేయాలన్న సంకల్పంతో ఉందన్నారు. భారతదేశంపై గూగుల్ ఎక్కువగా దృష్టిసారించిందని, ఇందులో భాగంగా ప్రస్తుతం దేశంలో తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోని వివిఐటి కళాశాలలోనే వర్క్‌షాపు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన నిపుణులు, వివిఐటి ప్రిన్సిపాల్ డాక్టర్ వై మల్లికార్జునరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వర్క్‌షాపు ఈనెల 10వ తేదీతో ముగియనుంది.