బిజినెస్

ఇఎస్‌ఐ వర్తింపు పరిమితి రూ. 21వేలకు పెంపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఇఎస్‌ఐ ఆరోగ్య బీమా వర్తించే పరిధిని ప్రస్తుత 15 వేల రూపాయల నుంచి 21 వేల రూపాయలకు పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. దీని ద్వారా మరో 50 లక్షల మందిని ఇఎస్‌ఐ పరిధిలోకి తీసుకురావాలని సంకల్పించింది. ధరల పెరుగుదల, జీతాల పెంపు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నైపుణ్యం లేని వ్యవసాయేతర కార్మికుల జీతాన్ని 42 శాతం పెంచి రోజువారీగా 350 రూపాయలకు చేర్చింది. ఇఎస్‌ఐ పరిధిలోకి వచ్చేవారి గరిష్ఠ జీతం 21 వేలు చేసినప్పటికీ అంతకంటే ఎక్కువ జీతగాళ్లు కూడా ఇఎస్‌ఐ సేవలు పొందవచ్చని వెల్లడించింది. ఈ తాజా నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని ఇఎస్‌ఐసి బోర్డు సమావేశానంతరం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.