బిజినెస్

ఐటీకి హైదరాబాద్ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: ఐటీ రంగం విస్తరణకు హైదరాబాద్‌కు మించిది మరొటి లేదని, ఇక్కడ ఐటీ మంత్రి కేటీఆర్ మోస్ట్ డైనమిక్ లీడర్ అని, ఆయన పరిశ్రమల స్థాపనకు ఎంతో సహకారం అందిస్తున్నారని నీతి అయోగ్ సీఇఓ అమితాబ్ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి అమితాబ్ కాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం గత ఐదు సంవత్సరాల్లో ఎంతో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఈ మార్పుకు మంత్రి కేటీఆర్ కృషే కారణమని
అభినందించారు. మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌కు మించిన నగరం మరొకటి లేదన్నారు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు పరిశోధన, సేవల అభివృద్ధి, ఆవిష్కరణలను ఏర్పాటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇక్కడ అయా కంపెనీలకు అవసరమైన నిపుణులు అందుబాటులో ఉన్నారని అన్నారు. ప్రస్తుతం 18 దేశాల నుంచి మైక్రాన్ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో హైదరాబాద్ కేంద్రంగా మారబోతుందని అమితాబ్ కాంత్ జోస్యం చెప్పారు. ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని కితాబునిచ్చారు. సెమీ కండక్టర్ రంగంలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న మైక్రాన్ సంస్థ నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలంటే హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకుంటే సాధ్యపడుతుందని సూచించారు. ఇక్కడ ప్రస్తుతం సెమి కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టమ్ సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ఇక్కడున్న ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఉన్నత ప్రమాణాలున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం కూడా దోహదం చేస్తున్నాయన్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించే కంపెనీలకు ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎంతో ప్రోత్సహాన్ని, సహకారాన్ని అందిస్తున్నారని అమితాబ్ కాంత్ ప్రశంసించారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి పని చేసిన అనుభవం తనకుందని ఆయన గుర్తుచేసుకున్నారు.
మైక్రాన్ డవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం తమకెంతో గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఉన్నాయని పెట్టుబడులకు ఎంతో మెరుగైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో మైక్రాన్ సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇతర సెమీ కండక్టర్ కంపెనీలను కూడా హైదరాబాద్‌కు తీసుకరావడానికి కృషి చేస్తున్నామని కేటీఆర్ అన్నారు.