బిజినెస్

సింగరేణితో ఒప్పందం ఈనాటిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 5: సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు సరఫరాకు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఈనాటిది కాదని జెన్‌కో సీఎండీ బీ శ్రీ్ధర్ తెలిపారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పాదనకు సంబంధించి మహానంది కోల్ ఫీల్డ్స్ నుంచి సేకరణ తగ్గిన నేపథ్యంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)తో 2014-15లో అప్పటి ప్రభుత్వం అవసరాలకు తగ్గట్టుగా దిగుమతి చేసుకుందన్నారు. 2016-17లో 50 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకుందని ఈ ప్రకారం నిర్దేశించిన ధరల కంటే 20 శాతం అదనంగా చెల్లించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. కేంద్ర నూతన బొగ్గు రవాణా (ఎన్‌సీడీపీ) విధానంలో భాగంగా 2017లో ఉత్పాదనలో 10 శాతం ఈ- వేలం ద్వారా ఇంధనేతర రంగాల వినియోగానికి కేటాయించాలని ఆదేశించింది. నూతన విధానం ప్రకారం అమల్లోకి వచ్చిన ధరలను కూడా సింగరేణి కాలరీస్ సంస్థ ప్రకటించిందని ఎంఓయూలు కుదుర్చుకున్నప్పటికీ ఈ ధరలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. మహానంది కోల్ ఫీల్డ్స్‌తో కుదుర్చుకున్న ఇంధన ఒప్పందం ప్రకారం డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)కు 8.312 మిలియన్ టన్నులు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)కి 1.88 మిలియన్ టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. దీని తరువాత సింగరేణి కాలరీస్ నుంచి 3.88 మిలియన్ టన్నుల దిగుమతికి ఒప్పందం కుదిరింది. గ్రిడ్
డిమాండ్‌ను బట్టి ఎన్టీటీపీఎస్‌కు 3.656 మిలియన్ టన్నుల అదనపు సరఫరా చేయాల్సి ఉంది. ఈ- వేలం ప్రక్రియ ద్వారా 2014 నుంచి ఏపీ జెన్‌కో సేకరిస్తోంది. 2014-15 ప్రీమియం ధరల ప్రకారం 36,20,941 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. అది 2015-16లో 52,35,967 మెట్రిక్ టన్నులకు పెరిగింది. తరువాత 2016-17లో 50 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు సేకరణకు ఎస్‌ఈసీఎంతో ఏపీ జెన్‌కో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 39,19,689 మెట్రిక్ టన్నులు నిర్దేశించిన ధరలతో పాటు 20 శాతం అదనపు ధరను సింగరేణి కాలరీస్ నిర్ణయించిందని జెన్‌కో సీఎండీ వివరించారు. 2017-18లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 32 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 31,30,291 మెట్రిక్ టన్నులు ఇదే ధరకు సింగరేణి సంస్థ సరఫరా చేసిందన్నారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల పర్చేజ్ ఆర్డర్ ప్రకారమే 2019-20లో 17,00,183 మెట్రిక్ టన్నుల బొగ్గును ప్రస్తుతం జెన్‌కో కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ), కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లో 46,486 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, గత ఏడాది ఇదే నెలలో థర్మల్ పవర్ ప్లాంట్లలో 29,543 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఉండేందుకు గతంలో కుదుర్చుకున్న విధంగానే నిర్దేశించిన ధరలకు బొగ్గు కొనుగోళ్లు జరుపుతున్నామని స్పష్టం చేశారు.

*చిత్రం...జెన్‌కో సీఎండీ శ్రీ్ధర్