బిజినెస్

‘బేర్’మంటున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారత స్టాక్ మార్కెట్ ఈ వారం నష్టాలను చవిచూశాయి. బేర్ మార్కెట్ నిరాటంకంగా కొనసాగింది. వరుస నష్టాలతో పలు పేరొందిన కంపెనీల షేర్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఒకవైపు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి మరొకవైపు ఆసియా స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీశాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లకు కూడా నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్సీ)లో సెనె్సక్స్ ఈ వారం మొదటి రోజైన సోమవారం 38,822.57 పాయింట్లతో మొదలైంది. ఉదయం కొంత వరకు ఆశాజనకంగానే కనిపించినప్పటికీ ఆ తర్వాత మార్కెట్ పతనం ప్రారంభమైంది. చివరిలో దేశీయ మదుపరులు ఆదుకోవడంతో కొంత వరకు కోలుకున్నప్పటికీ సెనె్సక్స్‌కు నష్టాలు తప్పలేదు. చివరికి 38,667.33 పాయింట్ల వద్ద ముగిసింది. ఆ మరుసటి రోజే మూడు వందలకు పైగా పాయింట్లు కోల్పోయి మదుపరులకు నష్టాలనే మిగిల్చింది. బుధవారం గాంధీ జయంతి కావడంతో స్టాక్ మార్కెట్లు నడవలేదు. గురు, శుక్రవారాల్లోనూ ఇటు బీఎస్సీలో నిఫ్టీ, అటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ పాయింట్లు పతనాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో భారత్ నష్టాలను ఎదుర్కోంటున్నది. ఆర్థిక మాంద్యం పరిస్థితుల నుంచి బయట పడేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు గానీ, ఆర్బీఐ చేపట్టిన సంస్కరణలు గానీ పెద్ద ఫలితాన్ని చూపడం లేదు. వచ్చే వారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశే్లషకుల అంచనా.