క్రీడాభూమి

మీకు ఆ అధికారం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఇటీవల సవరణలు చేసిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) నియమావళి ప్రకారం ఎవరు ఏమి చేయాలో శాసించే అధికారం పాలనాధికారుల బృందం (సీఓఏ)కు లేదని తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) స్పష్టం చేసింది. ఈనెల 23న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు అర్హత ఉందో లేదో నిరూపించుకోవాల్సిందిగా టీఎన్‌సీఏతోపాటు హర్యానా, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలకు కూడా సీఓఏ నోటీసులు జారీ చేసింది.
సరైన వివరణ ఇవ్వకపోతే వార్షిక సమావేశంలో పాల్గొనే అర్హత కోల్పోతారని హెచ్చరించింది. అయితే, ఈ హెచ్చరికలను టీఎన్‌సీఏ తోసిపుచ్చింది. సమావేశానికి హాజరుకాకుండా నిలువరించే అధికారం సీఓఏకు లేదని తేల్చిచెప్పింది.