బిజినెస్

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఇప్పటి వరకు వరుస నష్టాలతో మదుపరులను కలవరపరచిన మార్కెట్లు మంగళవా రం విజయదశమి సెలవుదినానంతరం లాభాల్లోకి రావడం శుభ సూచికం. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, లో హ స్టాక్స్ భారీగా లాభాలను సంతరించుకున్నాయి. తొలు త ఆచితూచి వ్యవహరించిన మదుపర్లు మధ్యాహ్నం తర్వా త భారీగా వాటాల కొనుగోళ్లకు దిగారు. దీంతో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 645.97 పాయింట్లు ఎగబాకింది. 1.72 శాతం లాభాలతో 38.177.95 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అదే స్ధాయిలో నిఫ్టీ సైతం 186.90 పాయింట్లు (1.68 శాతం) లాభపడి 11,313.30 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ చార్టులో ఇండస్‌ఇండ్ బ్యాంక్ భారీగా 5.45 శాతం లాభపడింది. అలాగే భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు యెస్ బ్యాంక్ భారీగా 5.25 శాతం నష్టాల పాలైంది. అలాగే హీరోమోటోకార్ప్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో సైతం 2.65 శాతం నష్టపోయాయి.
స్వల్ప నష్టాల్లో రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం 3 పైసలు నష్టపోయి ఇంట్రాడేలో 70.98గాట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.08 శాతం పెరిగి బ్యారెల్ 58.77 డాలర్ల వంతున ట్రేడైంది. ఇక అమెరికా-చైనా వాణిజ్య చర్చల క్రమంలో మదుపర్లు వేచిచూసే దోరణిని అనుసరించడంతో ఆసియా మార్కెట్లు బుధవారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.