బిజినెస్

2% నష్టపోయిన టైటాన్ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఆభరణాల వాణిజ్య ఆదాయంలో తగ్గుదలను చూపిన టైటాన్ కంపెనీ వాటాలు బుధవారం 2శాతం పైగా నష్టపోయాయి. ఈమేరకు 2019-20 ఆర్థిక సంవత్సరం రెండోత్రైమాసిక ఫలితాలను ఆ కంపెనీ వెల్లడించిన వెంటనే స్టాక్ మార్కెట్లో వాటాలు విక్రయాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 2.41 శాతం నష్టపోయిన వాటాలు రూ. 1.229.05కు పడిపోయాయి. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 2.27 శాతం నష్టంతో ఒక్కో వాటా రూ. 1,230గా ట్రేడైంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,689.64 కోట్ల నుంచి రూ. 1,09,113.36 కోట్లకు పడిపోయింది. ఆభరణాల రీటెయిల్ (సెకంటరీ) అమ్మకాల్లో 7 శాతం పెరుగుదల చోటుచేసుకున్న దృష్ట్యా తమ కంపెనీ ఆభరణాల విభాగంలో గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో 2 శాతంకన్నా అధికంగా తగ్గుదల చోటుచేసుకుందని బుధవారం టైటాన్ కంపెనీ తన బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వివరించింది. బంగారం ధరల్లో పెరుగుదల కారణంగా గత జూన్ మాసం మధ్య నుంచి ఆభరణాల విక్రయాల్లో తగ్గుదల చోటుచేసుకుందని, జూలైలో కూడా ఆ ప్రభావం కనిపించిందని, ఆ తర్వాత వృద్ధి చోటుచేసుకుందని కంపెనీ వివరించింది. రీటెయిల్ విక్రయాల్లో మాత్రం ఆగస్టు-సెప్టెంబర్ మాసాల మధ్య కాలంలో 15 శాతం వృద్ధి జరిగిందని తెలిపింది. కాగా తదుపరి త్రైమాసికంలో లోటును అధిగమిస్తామన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది.