బిజినెస్

అలహాబాద్ బ్యాంక్ విలీనం శుభ సూచకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: 113 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కల్గిన ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్‌ను విలీనం చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ద్వారా ఇండియన్ బ్యాంక్ మరింత బలపడి దేశ ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషించనున్నదని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్య నిర్వహణాధికారి పద్మజా చుండూరు పేర్కొన్నారు. స్థానిక లబ్బీపేట గేట్ వే సమావేశ మందిరంలో ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఉన్నత స్థాయి అధికారులు, అనంతరం ఖాతాదారుల సమావేశంలో పద్మజా మాట్లాడుతూ తమ బ్యాంక్ దేశ వ్యాప్తంగా 19వేల ఉద్యోగులు, 2,930 శాఖలతో రూ. 4.38 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నదన్నారు. అలాగే అలహాబాద్ బ్యాంక్ 2020 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి విలీనం తర్వాత 8 లక్షల కోట్లకు పైగా వ్యాపారంతో 7వ అతి పెద్ద జాతీయ బ్యాంక్‌గా అవతరించనున్నదన్నారు. పోటీ ప్రపంచంలో ఒత్తిడిలను ఎదుర్కొంటూ ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఇండియన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుదన్నారు.
ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో 550 ఇండియన్ బ్యాంక్ శాఖలున్నాయని అలహాబాద్ బ్యంక్‌కు ఉన్న 100 శాఖలు కలుపుకుని మరింతగా బలపడతామన్నారు. అలహాబాద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ కే రామచంద్రన్ మాట్లాడుతూ విలీనానికి ముందు ప్రధాన నగరాల్లో టౌన్‌హాల్ మీటింగ్‌లు, ఖాతాదారుల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ పీ భరత్, అలహాబాద్ బ్యాంక్ సర్కిల్ జనరల్ మేనేజర్ జీ సంతోష్‌కుమార్, ఇండియన్ బ్యాంక్ అమరావతి జోనల్ మేనేజర్ పీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ పద్మజ