బిజినెస్

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఈ ఏడాది భారత దేశ వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు 6 శాతానికి తగ్గించింది. గడచిన త్రైమాసికాల్లో జరిగిన ఆర్థికాభివృద్థి తీరును పరిగణనలోకి తీసుకుని ఇలా సవరణలు చేసినట్టు ఆదివారం నాడిక్కడ విడుదలైన ప్రపంచ బ్యాంకు ‘సౌత్ ఏసియా ఎకనామిక్ ఫోకస్’ అధ్యయన నివేదిక వెల్లడించింది. 2018-19లో భారత వృద్ధిరేటు 6.9 శాతంగా ఉంది. ఐతే భారత్ క్రమంగా 2021 నాటికి 6.9 శాతం వృద్థిరేటుకు, ఆ తర్వాత 2022 నాటికి 7.2 శాతం వృద్ధిరేటుకు చేరుకుంటుందని ఆ నివేదిక తెలిపింది. ద్రవ్య లభ్యత మాత్రం ఇంకా పూడ్చాల్సిన స్థాయి లోటుతో ఉంటుందని తెలిపింది. ఈక్రమంలో ధరల పెరుగుదల కూడా ఉంటుందని తెలిపింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో జరుపనున్న వార్షిక సమావేశం నేపధ్యంలో తాజాగా ఇలా భారత వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు తగ్గించడం గమనార్హం. వరుసగా రెండో సంవత్సరం భారత వృద్ధిరేటు అంచనాలు తగ్గినట్టు ఆ నివేదిక తెలిపింది. 2017-18లో 7.2 శాతంగా ఉన్న వృద్ధిరేటు 2018-19లో 6.8 శాతానికి తగ్గిపోగా తాజాగా 6 శాతానికి తగ్గిందని ఆ నివేది వివరించింది. ఓవైపుపారిశ్రామిక వృద్ధిరేటు 6.9 శాతానికి పెరిగిందని, కారణం తయారీ, నిర్మాణ రంగాల్లో వృద్ధిచోటు చేసుకోవడమేనని ఆ నివేదిక వివరించింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ రంగ వృద్థిరేటు 2.9 శాతానికి, సేవారంగ వృద్ధిరేటు 7.5 శాతానికి చేరిందని నివేదిక పేర్కొంది.
ప్రైవేటు వినిమయ డిమాండ్ బాగా తగ్గడం వల్ల మొత్తం వృద్ధిరేటుపై ఆ ప్రభావం పడిందని, ఇందువల్ల పారిశ్రామికోత్పత్తులు, సేవారంగ ఉత్పత్తుల సరఫరా డిమాండ్‌కు తగ్గినట్టుగా లేకుండా పోయిందని ఆ నివేదిక వెల్లడించింది. ఆర్థికాభివృద్ధిలో మందగమనం కారణంగా ఆహారం వస్తువుల ధరల పెరుగుదల చోటుచేసుకుందని, దరిమిలా 2018-19లోద్రవ్యోల్మణం 3.4 శాతానికి చేరిందని తెలిపింది. అలాగే 2019-20లోనూ రిజర్వు బ్యాంకు మధ్య తరహా లక్ష్యమైన 4 శాతానికన్నా తక్కువ స్థాయిలోనే నిలిచిందని వివరించింది. ఇందువల్ల ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని సరళతరం చేసేందుకు వీలుకలిగిందని అందుకే జనవరి 2019 నుంచి ఇప్పటి వరకు 135 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్ల కోత జరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక గుర్తు చేసింది. 2-18-19లో భారత్ పద్దులోటు స్థూల జాతీయోత్పత్తి రేటును 1.8 శాతం నుంచి 2.1 శాతానికి విస్తరించిందని తెలిపింది. ఇక ఫైనాన్స్ రంగం విషయానికొస్తే 2018 అక్టోబర్ నుంచి వౌలిక రంగ పెట్టుబడుల్లో వృద్ధి చోటుచేసుకుని ఆర్ధిక సంవత్సరాంతానికి 411.9 బిలియన్ డాలర్ల మేర ఈ పెట్టుబడులు వచ్చాయి. ఐతే ఈ ఏడాది ప్రథమార్థంలో చాలాభాగం పెట్టుబడులు తరలివెళ్లిపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ గడచిన 2018 మార్చి నుంచి అక్టోబర్ 12.1 శాతం తగ్గిపోయింది. ఆ తర్వాత 2019 మార్చి నుంచి దాదాపు 7శాతం బలపడిందని నివేదిక వివరించింది. కాగా కేంద్ర ప్రభుత్వ రుణాలు ప్రధానంగా దేశీయంగానూ, దీర్ఘకాలిక పద్ధతిలోనూ ఉంటూ జీడీపీలో 67 శాతంగా స్థిరంగా కొనసాగుతున్నాయని వివరించింది.
తగ్గుతున్న పేదరికం
ఈ దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోందని, కాకపోతే ఈ విషయంలో గతంకన్నా కొంత మందగమనం చోటుచేసుకుందని విశే్లషించింది. 2011-12 నుంచి 2015-16 వరకు పేదరికం శాతం 21.6 నుంచి 13.4 శాతానికి తగ్గిందని ఆ నివేదిక వివరించింది. వస్తుసేవల పన్ను, పెద్దనోట్ల రద్దు, గ్రామీణ ఆర్థికాభివృద్ధి మందగమనంతోబాటు పెరిగిన నిరుద్యోగ యువత, పట్టణాల్లో పేదరిక కుటుంబాల శాతం పెరుగుదల వంటి కారణాలు దేశ ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకాలుగా ఉన్నాయని నివేదిక తెలిపింది. గ్రామీణ ఆర్థికాదాయంలో తగ్గుదల కారణంగా వినిమయం ఈ ఏడాది అంతం వరకు వత్తికి గురయ్యే అవకాశాలున్నాయని, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల రుణ కేటాయింపులు, వాహన విక్రయాలు తగ్గుతాయని నివేదించింది.