బిజినెస్

‘కార్పొరేట్’ ఫలితాలే నిర్దేశిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, విప్రోవంటి కంపెనీలు ఈవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దృష్ట్యా ఆ ప్రభావంతోబాటు, అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు సైతం ప్రధానంగా దేశీయ స్టాక్ మార్కెట్ల స్థితిగతులను నిర్దేశిస్తాయని వాణిజ్య విశే్లషకులు పేర్కొంటున్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన త్రైమాసిక నికర లాభాల్లో 2.2 శాతం తగ్గినట్టు తెలిపింది. మొత్తం రూ. 4,019 కోట్లు లాభాలు వచ్చినట్టు వివరించింది. ప్రత్యేకించి శుక్రవారం మార్కెట్ల సమయం ముగిసిన తర్వాత విడుదలైన ఇన్ఫోసిస్ గణాంకాలు సోమవారం మార్కెట్లను ప్రభావితం చేస్తాయంటున్నారు. అలాగే చైనా-అమెరికా వాణిజ్య చర్చల ఫలితాలపై మదుపర్లు దృష్టి నిలిపారు. ఏదేమైనా వారారంభంలో మిశ్రమ ఫలితాలే నమోదు కావచ్చని ఆ తర్వాత మార్కెట్లు పుంజుకోవచ్చని ప్రముఖ విశే్లషకుడు అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. మదుపర్ల సెంటిమెంటుపై ఈ త్రైమాసిక ఫలితాల వారం గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని మరో విశే్లషకుడు జిమీత్ మోదీ తెలిపారు. ఈవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న కంపెనీల్లో హిందూస్థాన్ యునీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), ఫెడరల్ బ్యాంకు కూడా ఉన్నాయి. ఈక్రమంలో త్రైమాసిక ఫలితాలతోబాటు ప్రపంచ బ్యాంకు మనదేశ వృద్ధిరేటు అంచనాలు తగ్గించడం, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (డబ్ల్యుపీవో) ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని వాణిజ్య విశే్లషకులు తెలిపారు. అలాగే శుక్రవారం వెలువడనున్న పారిశ్రామికాభివృద్ధి గణాంకాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. గత ఆగస్టులో ఈ వృద్ధిరేటు 1.1 శాతం తగ్గింది. ప్రధానంగా తయారీ రంగంతోబాటు విద్యుదుద్పాదన, గనుల రంగాల్లో చోటుచేసుకున్న తగ్గుదలే మొత్తంగా పారిశ్రామిక వృద్ధిరేటును ప్రభావితం చేశాయని మరో విశే్లషకుడు ముస్త్ఫా నదీమ్ తెలిపారు. కాగా గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా-చైనా వాణిజ్య చర్చల తీరుపై చేసిన సానుకూల వ్యాఖ్యలతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో లాభాల ర్యాలీ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే సౌదీ అరేబియాకు సమీపంలోని ఎర్ర సముద్రంలో ఉన్న ఓ ఇరానియన్ చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడులు జరిగాయన్న వార్తలతో ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో సరఫరా తగ్గి ముడి చమురు ధరలు 2 శాతం పెరగడం జరిగింది. గడచిన వారం బీఎస్‌ఈలో సెనె్సక్స్ 453.77 పాయింట్లు (1.20 శాతం) లాభపడింది.