బిజినెస్

జీఎస్టీ వసూళ్ల పెంపునకు హైలెవల్ కమిటీ సూచనలేమిటో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: వస్తుసేవల పన్ను వసూళ్లు పెరిగేందుకు అవసరమైన సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ తొలి సమావేశం మంగళవారం ఇక్కడ జరుగనుంది. గత వారం ఈ అధికారుల కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. క్రమంగా తగ్గుముంఖం పట్టుతున్న వస్తుసేవల పన్ను వసూళ్లను, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సెప్టెంబర్‌లో 19 నెలల కనిష్టానికి జీఎస్టీ వసూళ్లు పడిపోయి రూ. 91,916 కోట్లు మాత్రమే వసూలయ్యా యి. ఇప్పటికే మందగమనంలో ఉన్న దేశ ఆర్థికాభివృద్ధిని ఈ పరిణామం మరింత అద్వాన్నంగా మార్చింది. ఈక్రమంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ ఈనెల 15న నిర్వహించనున్న తొలి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 12మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో రాష్ట్ర స్థాయి జీఎస్‌టీ కమిషనర్లు, కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు ఉన్నారు.