బిజినెస్

పీఎన్‌బీ, యూబీఐ, ఓబీసీ విలీనానికి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) విలీనానికి రంగం సిద్ధమైంది. ఈక్రమంలో ఉమ్మడి లోగో రూపొందించేందుకు కసరత్తు మొదలైంది. ఈ మూడు బ్యాంకులతో సంబంధం లేని ఓ ప్రముఖ వ్యక్తికి ఈ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం జరిగిందని యూబీఐకి చెందిన అత్యున్నతాధికారి ఒకరు ఆదివారం నాడిక్కడ వెల్లడించారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ మూడు బ్యాంకులు విలీనం అమలులోకి వస్తుంది. అప్పుడు మొత్తం రూ. 18 లక్షల కోట్ల వాణిజ్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఈ విలీన బ్యాంకు దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. వచ్చేవారం ఈ మూడు బ్యాంకులకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సమావేశం కానున్నారు. ప్రధానంగా పాలనాపరమైన విధాన రూపకల్పనపై ఆ సమావేశంలో చర్చ జరుగుతుందన్నారు. కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా నడుస్తున్న యూబీఐ రెండో త్రైమాసికానికి ఆర్బీఐ ప్రాంమ్ట్ కరెక్టివ్ ఆక్షన్ (పీసీఏ) పరిధి నుంచి వెలుపలికి వస్తుందని ఆ అధికారి వివరించారు.