బిజినెస్

భయం వీడింది.. మార్కెట్ ఎగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 445.91 పాయింట్లు ఎగబాకి దాదాపు 17 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 28,978.02 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 133.35 పాయింట్లు ఎగిసి సుమారు 18 నెలల గరిష్ఠ స్థాయికి చేరి 8,943 వద్ద నిలిచింది.
నిరాశాజనక అమెరికా ఉద్యోగ గణాంకాల మధ్య ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచబోదన్న అంచనాలు మదుపరులను ఉత్సాహపరిచాయి. దీంతో పెట్టుబడుల దిశగా కదిలారు. ఫలితంగానే సూచీలు భారీ లాభాలను అందుకోగలిగాయి. నిజానికి ఉదయం ఆరంభం నుంచి కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే కదలాడాయి. సెనె్సక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో మొదలయ్యాయి. చివరిదాకా కొనుగోళ్ల జోరు కొనసాగడంతో ఈ లాభాలు సమయం గడుస్తున్నకొద్దీ పెరుగుతూ పోయాయి. దీంతో గడచిన రెండు నెలల్లో సెనె్సక్స్, నిఫ్టీ ఎన్నడూ లేనంతగా ఈ ఒక్కరోజే అధిక లాభాలను పొందాయి. దేశీయ సేవల రంగం వృద్ధిరేటు మూడున్నరేళ్ల గరిష్ఠానికి చేరడం కూడా కలిసొచ్చింది.
ఇక బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, పవర్, రియల్టీ, మెటల్, చమురు, గ్యాస్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు మదుపరులను ఆకర్షించాయి. ఈ రంగాల షేర్ల విలువ 2.96 శాతం నుంచి 0.97 శాతం వరకు పెరిగింది. దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ షేర్ విలువ అత్యధికంగా 7.19 శాతం పెరిగితే, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ 6.14 శాతం పుంజుకుంది. అయితే దేశీయ ఐటిరంగ దిగ్గజం టిసిఎస్ షేర్ విలువ 1.17 శాతం పడిపోగా, ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా షేర్ విలువ 1.11 శాతం దిగజారింది. అంతర్జాతీయంగాను ఆసియా మార్కెట్లలో హాంకాగ్, చైనా, జపాన్ సూచీలూ 1.12 శాతం నుంచి 0.26 శాతం వరకు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలోనూ జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు 0.28 శాతం, 0.11 శాతం చొప్పున పెరగగా, బ్రిటన్ సూచీ మాత్రం 0.32 శాతం తగ్గింది.
ప్రభుత్వ బాండ్ల వేలం
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో మంగళవారం విదేశీ మదుపరులకు నిర్వహించిన ప్రభుత్వ రుణ బాండ్ల వేలం విజయవంతమైంది. 7,046 కోట్ల రూపాయల విలువైన బాండ్లకు 7,494 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఆన్‌లైన్‌లో ఈ వేలం నిర్వహించారు.