బిజినెస్

వరుసగా మూడో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజైన మంగళవారం సైతం లాభాల బాటలో నడిచాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఫలప్రదంగా సాగుతుండడంతోబాటు, వినిమయ డిమాండ్ ఈ పండుగ సీజన్‌లో పుంజుకుంటుందన్న అంచనాలు మదుపర్లకు ప్రోత్సాహాన్నించిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఈక్రమంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సూచీ సెనె్సక్స్ పరుగులుపెట్టి ఏకంగా 421 పాయింట్లు ఎగబాకి ఆ తర్వాత దిద్దుబాటుకు గురైంది. చివరికి 291.62 పాయింట్ల ఆధిక్యతతో 0.76 శాతం లాభపడి 38,506.09 పాయింట్లతో రెండు వారాల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 87 పాయింట్ల ఆధిక్యతతో 0.77 శాతం లాభపడి 11,428.30 పాయింట్ల గరిష్ట స్ధాయిలో స్థిరపడింది. ప్రధానంగా వాహన, లోహ రంగాలు భారీగా లాభపడ్డాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో వేదాంత, ఎం అండ్ ఎం, ఓఎన్‌జీసీ, హీరోమోటోకార్ప్, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్ అత్యధికంగా 3.79 శాతం లాభపడ్డాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ 2.53 శాతం నష్టపోయాయి. సెనె్సక్స్‌లో మొత్తం 30 వాటాల్లో 24 వాటాలు లాభాలతో ముగియగా, 6 నష్టపోయాయి. ఇక రంగాల వారీగా బీఎస్‌ఈ పరిధిలో వాహన రంగం 2.36 శాతం లాభాలతో అగ్ర భాగాన నిలిచింది. అలాగే లోహ, బ్యాంకెక్స్, విద్యుత్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు సైతం 1.56 శాతం లాభాలను సంతరించుకున్నాయి. ఐతే టెలికాం, టెక్, ఐటీ సూచీలు 2.15 శాతం నష్టపోయాయి. ఇక బ్రాడర్ బీఎస్‌ఈలో లార్జ్‌క్యాప్ సెనె్సక్స్ బెంచ్‌మార్క్ కంటే 0.79 శాతం అధికంగా లాభపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 0.72 శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం 0.11 శాతం నష్టపోయింది. కాగా గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెనె్సక్స్ మొత్తం 625.69 పాయింట్లు, నిఫ్టీ 198.75 పాయింట్ల వంతున లాభాలను సంతరించుకున్నాయి. ఇలావుండగా ఈ పండుగ సీజన్‌లో వాహనాల విక్రయాలు మరింతగా పుంజుకుంటాయన్న అంచానలతో ఆ రంగంలో వాటాల కొనుకోళ్లు అధికంగా జరిగాయని వాణిజ్య విశే్లషకులు చెబుతున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎప్‌ఐఐ) గత రెండు రోజులుగా అధిక శాతం వాటాలు కొనుగోలు చేశారు. ప్రధానంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో స్థిరత్వం, రెండోత్రైమాసిక ఫలితాలు వెలువడడం ఆరంభమైన దృష్ట్యా ప్రధానంగా మదుపర్ల దృష్టి ఆ వైపు నిలిచింది. త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నా భవిష్యత్తులో కొన్ని కార్పొరేట్ కంపెనీలు లాభాల వైపు మళ్లే అవకాశాలున్నాయన్న అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని నింపిందని ప్రముఖ విశే్లషకుడు వనోద్‌నాయర్ తెలిపారు. డిసెంబర్‌లో ఆర్బీఐ మరోమారు రెపోరేట్ల కోత విధిస్తుందన్న కథనాలు కూడా మార్కెట్లకు ఊతమిచ్చిందన్నారు. ఇక సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టం 3.99 శాతానికి పెరిగింది. కూరగాయలు, పప్పు దినుసుల అధిక ధరలే ఇందుకు కారణమని, ఐతే ఈ ద్రవ్యోల్బణం స్ధాయికూడా ఆర్బీఐ సంతృప్తికర జోన్ పరిధిలోనే ఉందని తెలిపారు.
రూపాయి మరింత బలహీనం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం మరోమారు 31 పైసల మేర నష్టపోయి ఇంట్రాడేలో 71.54గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 1.75 శాతం తగ్గి బ్యారెల్ 58.31 డాలర్ల వంతున ట్రేడైంది. ఇక ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనూ, సియోల్, టోక్యో మార్కెట్లు లాభాల్లోనూ ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో సానుకూలంగానే సాగాయి.