బిజినెస్

ఏపీలో ఎయిర్ ఇండియా సేవల పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : నవ్యాంధ్రలో ఎయిర్ ఇండియా సేవలు మరింత పెరగనున్నాయి. ఆదరణ ఉన్నప్పటికీ వివిధ కారణాల రీత్యా రద్దయిన సర్వీసులను తిరిగి పునరుద్ధరించడంతో పాటు కొత్తగా మరికొన్ని సర్వీసులు నడిపేందుకు ఎయిర్ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లోహాని లేఖ రాశారు. కొత్తగా విజయవాడ-తిరుపతి-వైజాగ్ సర్వీసుతో పాటు విజయవాడ- షిరిడీ, విజయవాడ-బెంగళూరు సర్వీసులు రన్‌వే పైకి రానున్నాయి. ఈ రూట్లలో కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎయిర్ ఇండియా చైర్మన్ లోహాని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై నుంచి ఎయిర్ ఇండియా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తమ సర్వీసులను ఉపసంహరించుకుంది. దీనిపై విజయసాయిరెడ్డి గతంలో చైర్మన్ లోహానీతో సమావేశమై విజ్ఞప్తి చేశారు. రద్దయిన సర్వీసులతో పాటు కొత్తవాటిపై లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన లోహానీ రద్దయిన సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు వైజాగ్-విజయవాడ-తిరుపతి, వైజాగ్-విజయవాడ-బెంగళూరు మధ్య నిత్యం విమాన సర్వీసు నడపాలని కోరారు. అలాగే ప్రస్తుతం ఢిల్లీ-విజయవాడ మధ్య వారానికి మూడు రోజులు నడుస్తున్న సర్వీసును ఈ నెల 27నుంచి ఢిల్లీ-విజయవాడ-తిరుపతి-విజయవాడ-్ఢల్లీ సర్వీసుగా నడపనున్నట్టు హామీ ఇచ్చారు. రాష్ట్రానికి విమాన సర్వీసులు పునరుద్ధరించడంతో పాటు కొత్త సర్వీసులు నడిపేందుకు అంగీకరించడంపై ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.